న్యూస్ రౌండప్ టాప్ 20

1.మంగళగిరి కోర్టుకు నారా లోకేష్

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు వెళ్లారు.వైసీపీ నేతలపై వేసిన పరువు నష్టం దావా విషయంలో ఆయన అదనపు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.డ్వాక్రా సంఘాలపై చంద్రబాబు కామెంట్స్

చదువుకోని వారికోసం డ్వాక్రా సంఘాలు టిడిపి ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చి, మహిళల్లో పొదుపు శక్తిని పెంచినట్లు టిడిపి అధినేత చంద్రబాబు గుర్తు చేశారు.

3.పదవిపై వ్యామోహం లేదు : చెన్నమనేని రమేష్

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

ఎమ్మెల్యేగా ఉన్నా,  లేకున్నా తాను ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నానని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు.నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని పదవిపై తనకు వ్యామోహం లేదని అన్నారు.

4.మరో 160 రోజుల్లో చంద్రబాబు సీఎం

మరో 120 రోజుల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తారని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చన్న నాయుడు జోస్యం చెప్పారు.

5.ఢిల్లీలో వరద

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

దేశ రాజధాని ఢిల్లీలో వరద ముంపు ఇంకా కొనసాగుతోంది రికార్డు స్థాయిలో యమునా నది ప్రవహిస్తూ ఉండడంతో, ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.ఇప్పుడిప్పుడే కాస్త వరద తగ్గుముఖం పడుతోంది.

6.‘ కియ ‘ మిలియన్ కార్ల ఉత్పత్తిపై చంద్రబాబు స్పందన

అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ లో మిలియన్ కార్ల ఉత్పత్తి మైలరాయిని చేరుకోవడం ఆనందంగా ఉందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.

7.శ్రీ  చైతన్య విద్యాసంస్థల అధినేత మృతి

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు కన్నుమూశారు.

8.నేడు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్

ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు వ్యతిరేకంగా ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది.

9.  వైఎస్ వివేకా హత్య కేసు

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.నిందితులు భాస్కర్ రెడ్డి , గంగిరెడ్డి,  దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ , ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

10.టెట్ నిర్వహణకు 101 రోజులు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుంది విద్యాశాఖ అంచనా వేసింది.

11.ఆగస్టు 14 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

ఈనెల 14 నుంచి ఐసెట్ సెప్టెంబర్ 2 నుంచి ఎంసెట్ ఫార్మ్ కౌన్సిలింగ్ లు ప్రారంభమవుతాయి ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటన చేసింది.

12.పంపు హౌస్ ల నిర్వహణ జెన్ కోకు

ఎత్తిపోతల పథకాల్లోని పంపు హౌస్ ల నిర్వహణ బాధ్యతను జెన్ కొకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

13.విదేశీ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు.

14.కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ లలిత

 తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్న జస్టిస్ లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేశారు.

15.పవన్ కళ్యాణ్ పై అంబటి విమర్శలు

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థ పై మీకు ఉన్న అభ్యంతరం ఏమిటని ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

16.మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు

ఇప్పటివరకు అసైన్డ్ భూమి ఎవరికైనా అమ్మితే అది చెల్లదు అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

17.పంచకర్ల రాజీనామా పై సుబ్బారెడ్డి స్పందన

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

విశాఖ వైసిపి అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేయడంపై ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి స్పందించారు.రమేష్ బాబు రాజీనామా తొందరపాటు చర్య అని ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జి టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.

18.పవన్ కళ్యాణ్ కామెంట్స్

జగన్ గురించి ప్రధానికి చెప్పాల్సిన అవసరం లేదని , తానే చూసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

19.ఇస్రో బృందానికి జగన్ అభినందనలు

Telugu Ap Zenco, Chandrayan, Cm Kcr, Delhi Floods, Isro, Jagan, Dharmanaprasada,

చంద్రయాన్ త్రీ ప్రయోగం సక్సెస్ కావడంపై ఇస్రో బృందానికి ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -55,000

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -60,000

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube