టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అసలు పేరు వెలమకుచ వెంకట రమణా రెడ్డి( Velamakucha Venkata Ramana Reddy ).నిర్మాతగా మారకముందు ఇతను నైజాం ఏరియాలో మూవీ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగేవాడు.
దిల్ (2003) సినిమాతోనే ప్రొడ్యూసర్ గా మారాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థ స్థాపించి బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఫిదా, F2, శతమానం భవతి, నేనులోకల్, ఎంసీఏ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు.
బెస్ట్ సినిమాలు తీసినందుకుగాను రెండు నేషనల్ ఫిలిం అవార్డులను గెలుచుకున్నాడు.అయితే అసలు ఈయన తన పేరును మార్చుకొని దిల్ రాజుగా ఎలా మారాడు? ఆయనకు ఆ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.దీని గురించి ఒక ఇంటర్వ్యూలో కూడా దిల్ రాజును ప్రశ్నించాడు.
దానికి ఆయన ఆయన సమాధానం చెబుతూ.“నాకు దిల్ రాజు అనే నేమ్ ఎవరు పేరు పెట్టారో తెలియదు.కానీ అంతకుముందు వరకు నన్ను నైజాం రాజు అని పిలిచేవారు.
ఎందుకంటే నేను నైజాం ఏరియాలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించా.దిల్ సినిమా తీసిన తర్వాత కాలక్రమణా నన్ను దిల్ రాజు అని పిలవడం మొదలుపెట్టారు.
ఇప్పటికీ నన్ను దిల్ అని పిలిచే కొందరు సినిమా సెలబ్రిటీస్ ఉన్నారు.అందులో విక్టరీ వెంకటేష్( Victory Venkatesh ) ఒకరు.
అలాగే నా ఫ్రెండ్స్ లో కొందరు నన్ను ఓన్లీ దిల్ అని పిలుస్తారు.బూరుగపల్లి శివరామ కృష్ణ ఆ సినిమాకి దిల్ అని పేరు పెట్టారు.
చాలా మంచి పేరు అది.దానివల్లే నాకు దిల్ రాజు అనే పేరు వచ్చింది.నిజానికి ఈ టైటిల్ శివరామ కృష్ణ దగ్గరే ఉంది.దానిని నేను వెళ్లి అడగగానే వెంటనే ఇచ్చేశారు.అందుకే థాంక్స్ చెప్పుకోవాలి.” అని వెల్లడించారు.
2024లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన “ఫ్యామిలీ స్టార్” సినిమాని దిల్ రాజ్‌యే నిర్మించాడు.ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.ఈ మూవీ 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు.రాజమౌళి మూవీ ఆర్‌ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది.మరి ఇది హిట్ కావాలని ఆశిద్దాం.