మనలో చాలా మంది సిల్కీ అండ్ షైనీ హెయిర్ ( Silky and shiny hair )ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.అటువంటి జుట్టును పొందడం కోసం తెగ ఆరాటపడుతుంటారు.
రకరకాల కేశ ఉత్పత్తులను వాడుతుంటారు.హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను వినియోగిస్తుంటారు.
అయితే వాటితో లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి.కానీ తలస్నానం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ట్రిక్ ని కనుక పాటిస్తే సహజంగానే మీ జుట్టు సిల్కీగా మరియు షైనీ గా మెరిసిపోతుంది.
మరి ఇంతకీ ఆ సింపుల్ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద ఆకును( Aloe vera leaf ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు బియ్యం,( rice ) నాలుగు రెబ్బలు కరివేపాకు( curry leaves ) మరియు కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసి పదినిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్ లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు మీ రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ వాటర్ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే చాలా లాభాలు పొందుతారు.
ముఖ్యంగా పొడి జుట్టు రిపేర్ అవుతుంది.కురులకు చక్కని తేమ అందుతుంది.
హెయిర్ సిల్కీగా షైనీ గా మెరిసిపోతుంది.
అలాగే పైన చెప్పిన ట్రిక్ ను పాటించడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది.చుండ్రు సమస్య ఉంటే దూరం అవుతుంది.స్కాల్ప్ హెల్తీగా హైడ్రేట్ గా మారుతుంది.
హెయిర్ బ్రేకేజ్ కంట్రోల్ అవుతుంది.కురులు సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.
కాబట్టి సహజంగానే తమ జుట్టును సిల్కీగా షైనీ గా మరియు హెల్తీ గా మార్చుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పుకున్న విధంగా షాంపూ చేసుకోవడానికి ప్రయత్నించండి.