జుట్టు రాలడం అనేది అందరిలోనూ ఉండే కామన్ సమస్య.అయితే జుట్టు రాలడానికి అందరిలోనూ ఒకే రకమైన కారణాలు ఉండవు.
రీజన్ ఏదైనా కూడా కొన్ని వంటింటి చిట్కాలు జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాను.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టాప్ అండ్ బెస్ట్ రెమెడీని కనుక పాటించారంటే జుట్టు రాలడం తగ్గడమే కాదు కురులు పొడుగ్గా సైతం పెరుగుతాయి.
పొడవాటి జుట్టును కోరుకునే వారికి ఈ రెమెడీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం జుట్టు రాలడాన్ని అరికట్టి పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహించే ఆ రెమెడీ గురించి తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్ వేసుకోవాలి.అలాగే ఒక అరటిపండును వేసుకోవాలి.ఆ తర్వాత అరకప్పు ఫ్రెష్ అలోవెరా జెల్, నాలుగు తులసి ఆకులు, నాలుగు వేపాకులు, రెండు రెబ్బలు కరివేపాకు మరియు రెండు మందారం పువ్వులు( Hibiscus Flower ) వేసుకోవాలి.చివరిగా కొన్ని వాటర్ పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అరటిపండు, రైస్, కరివేపాకు, తులసి ఆకులు, వేపాకు, అలోవెరా, మందారం లో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాలు జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తాయి.
జుట్టు రాలడాన్ని అరికడతాయి.అదే సమయంలో జుట్టుకు అవసరమయ్యే పోషణ అందిస్తాయి.పొడుగ్గా మరియు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.వారానికి ఒక్కసారి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని పాటిస్తే పొడవాటి ఒత్తైన కురులు మీ సొంతం అవుతాయి.
మరియు ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.







