ప్రస్తుతం వింటర్ సీజన్( Winter season ) రన్ అవుతోంది.చలిపుల్లి రోజురోజుకు బలపడుతూ మనల్ని బలహీన పరుస్తుంది.
కాలానుగుణ వ్యాధుల నుండి పొడి మరియు నిస్తేజమైన చర్మం వరకు ఈ చలికాలంలో ఎన్నో సవాళ్లలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకే ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థను ( immune system )మరింత పటిష్టంగా ఉంచుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే వింటర్ లో మీ ఇమ్యూనిటీని పెంచడానికి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చలికాలంలో తినదగ్గ పండ్లలో జామ ముందు వరుసలో ఉంటుంది.
జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియలోనూ జామ సహాయపడుతుంది.
వింటర్ సీజన్ లో ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో సీతాఫలం( Custard apple ) ఒకటి.సీతాఫలం విటమిన్ బి6, కాల్షియం ( Vitamin B6, Calcium )మరియు మెగ్నీషియంతో లోడ్ చేయబడింది.అందువల్ల ఇది శక్తి మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉత్తమ శీతాకాలపు పండ్లలో నారింజ ఒకటి.ఇందులోని విటమిన్ సి తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తుంది.
ఇమ్యూనిటీని పెంచి జలుబు మరియు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్‌లు బారిన పడే రిస్క్ ను తగ్గిస్తుంది.మరియు చర్మానికి సహజమైన కాంతిని జోడిస్తుంది.
ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ( Antioxidants )పుష్కలంగా ఉండటం వల్ల చలికాలంలో దానిమ్మను కూడా తీసుకోవచ్చు.దానిమ్మ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.రక్తహీనతను దూరం చేస్తుంది.మరియు సమ్మేళనాలు అంటువ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.చలికాలంలో ద్రాక్ష పండ్లు కూడా హెల్త్ కు చాలా మేలు చేస్తాయి.యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి.
రోజుకు ఒక కప్పు ద్రాక్ష పండ్లు తింటే ఇమ్యూనిటీ పెరగడంతో పాటుగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.పైగా ద్రాక్షలో ఉండే సహజ చక్కెర తక్షణ శక్తిని అందిస్తుంది.
ఇక ఇవే కాకుండా పైనాపిల్, బొప్పాయి, కివి వంటి పండ్లు కూడా చలికాలంలో ఆరోగ్యంగా నిలబడతాయి.