అందరు దొంగలు ఒకేలా ఉండరు కదా.కొందరు ఇళ్లలో చొరబడి విలువైన వస్తువులు బంగారం, వెండి సామాను ఇంకా ఖరీదైనా వస్తువులను ఎత్తుకెళ్తుంటారు.
మరికొందరు ఇంటి ఆవరణలో ఉండే కొన్ని వస్తువులను అపహరణ చేస్తుంటారు.తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దొంగ పరిస్థితి చూస్తే అతడు ఇంటి బయట ఉన్న చెప్పులు షూస్ లను మాత్రమే ఎత్తుకొని వెళ్లి వాటిని సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తున్నాడు.
తాజాగా హైదరాబాద్ ( Hyderabad )లో హల్చల్ చేస్తున్న బూట్ల దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.వరుసగా ప్రజల బూట్లు దొంగతనం అవుతున్నాయని కొందరు ఫిర్యాదులు అందడంతో నికరించిన పోలీసులకు చివరికి దొంగను పట్టుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హైదరాబాద్ మహానగరంలోని రామంతపూర్( Ramanthapur ) ప్రాంతంలో గత కొంతకాలం నుంచి ఇళ్లలోని షూస్ దొంగతనం అవుతున్నాయి.దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.బూట్లు దొంగతనం పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, రెండు నెలల నుంచి పోలీసులు దొంగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.దీంతో పోలీసుల గస్తీ పెంచిన పోలీసులు బూట్లు దొంగలించే దొంగను పట్టుకున్నారు.
దొంగను పట్టుకొని విచారణ చేయగా పోలీసులకు మతిపోయే విషయాలు బయటపడ్డాయి.దొంగ చెప్పిన మాటలు విని పోలీసులు నెవ్వరపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దొంగతనం చేసిన వ్యక్తి పేరు మల్లేష్( Mallesh ).ఆ దొంగ రామంతపూర్ లోని వాసవి నగర్ లో తన భార్య రేణుకతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు.
అతడు గడిచిన రెండు నెలల ప్రాంతంలో ఏకంగా 100 ఇళ్లలో పైగా దొంగతనాలు చేశాడు.అయితే, ఈ దొంగనాల్లో విలువైన వస్తువులు బంగారం, వెండి ఇంకా ఏవైనా ఖరీదైన వస్తువులు మాత్రం కాదు.కేవలం బూట్ల జతలను మాత్రమే ఎత్తుకెళ్లాడు.
దొంగతనం చేసిన బూట్లను మల్లేష్ సేకరించి అనంతరం ఎర్రగడ్డలో వాటిని 100 , 200 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు.అయితే, ఈ విషయంపై భార్య రేణుకకు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పోలీసులు పిలిపించగా ఆవిడ మద్యం తాగి వచ్చి రావడం గమనార్హం.
అక్కడ పోలీస్ స్టేషన్కు మద్యం తాగి వచ్చి పోలీసులతో ఇష్టానుసారంగా మారడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇలాంటి దొంగను తాము ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.