గుండుసూది నుంచి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ ( Electronics )వస్తువుల వరకు ఇంకా అనేక రకాల వస్తువులను కూర్చున్న చోట నుంచే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించుకునే రోజులు ఇవి.ఒకవేళ మీరు కొన్ని కారణాలవల్ల వచ్చిన ఆర్డర్ నచ్చకపోయినా, లేకపోతే ఏదైనా తప్పు వచ్చిన దానిని క్యాన్సిల్ చేయాలని అనుకుంటే దానిని కంపెనీలు చాలా సులువుగా రిటర్న్స్ తీసుకుంటున్నాయి.
అయితే, కొన్నిటిపై కొన్ని షరతులు వర్తింపచేస్తాయి అనుకోండి అది వేరే సంగతి.అయితే, ఈ రిటర్న్స్ పై అతి త్వరలో ఈ రూల్ మారబోతోంది.
ఒకవేళ మీరు ఏదైనా ఆర్డర్ను తెప్పించుకున్న తర్వాత అది మీకు నచ్చకపోతే గనుక రిటర్న్ తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కట్టిన డబ్బులలో కొద్ది మొత్తం డబ్బును ఆన్లైన్ డెలివరీ కంపెనీ వసూలు చేయబోతున్నాయి.
డైరెక్ట్ మాల్స్ కి షాపింగ్ కి వెళ్లి కొనడం తగ్గిపోయిన రోజులలో అంతా ఇప్పుడు ఆన్లైన్ రోజులు అయిపోయాయి.ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ ఆన్లైన్ షాపింగ్ మరింత వేగంగా పుంజుకుంది.ఇక హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై ( Hyderabad, Bangalore, Delhi, Mumbai )లాంటి మహానగరాలలో కొన్ని కంపెనీలు కేవలం పది నిమిషాలలో మీ ఆర్డర్ తీసుకోవచ్చేందుకు ఇన్స్టంట్ డెలివరీస్ అంటూ ఆన్లైన్ వైపు పరుగులు తీసేలా ఆఫర్లు ఇస్తున్నాయి.
అయితే, ఇకపై ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ కు క్యాన్సల్ చేస్తే సర్ చార్జీలు వసూలు చేయాలని కొన్ని ఈ కామర్స్ కంపెనీలు నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఎవరైనా వస్తువు ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత మీకు అనుకున్నట్లుగా రాకపోయినా, ఒకవేళ నాణ్యత లేకపోయినా సరే ఇతర సమస్యలు ఉన్న దాన్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండేది.అయితే కొందరు ఈ సౌకర్యాన్ని తప్పుదోవ పట్టించడం వల్ల కంపెనీలు కొన్ని కొత్త పాలసీలను మార్చుకోబోతున్నాయి.ముఖ్యంగా ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్కార్ట్ లో ఈ ఫెసిలిటీని త్వరలో ఆపేయబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ పరిస్థితి అన్ని ఆర్డర్లకు కాకుండా కేవలం నిర్దిష్ట ఆర్డర్లను రద్దు చేసే కస్టమర్లను దగ్గర క్యాన్సిలేషన్ చార్జెస్ వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతోంది.దీన్నిబట్టి భవిష్యత్తులో ఆర్డర్ను రద్దు చేస్తే డబ్బులు చెల్లించాల్సింది వస్తుందన్నమాట.
ఈ వసూలు అమౌంట్ వస్తువు ధరపై ఆధారపడి ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.ఫ్లిప్కార్ట్ ఇంకా ఈ పాలసీన అధికారికంగా ప్రకటించలేదు.
ఈ రూల్ ను మైంత్ర కూడా అమలు చేయబోతుందని సమాచారం.