ఆన్లైన్లో విషం తెప్పించుకొని సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ టెక్కి..

ఏ సంసార జీవితంలోనైనా దంపతుల మధ్య చిన్నపాటి గొడవలు జరగడం మామూలే.అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు చివరకు ప్రాణాలు తీసుకున్నంత వరకు వెళ్తున్నాయి.

 Hyderabad Tech Who Committed Suicide By Bringing Poison Online, Hyderabad Techie-TeluguStop.com

తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ( Software engineering )చేస్తున్న భార్య, కాంట్రాక్టర్ గా పని చేసుకుంటున్న భర్త ఏమైందో తెలియదు గానీ వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి.

దీంతో ఒకరిపై ఒకరికి కోపం పెరిగింది.అప్పటినుంచి వారిద్దరూ ఎడమొఖం, పెడ ముఖంగా వ్యవహరిస్తూ ఉండడం, చివరకు సమస్యకు పుల్ స్టాప్ పెట్టాలని భావించినప్పటికీ సమస్య తీరకపోవడంతో భార్య చివరకు ఆన్లైన్లో విషయం తెప్పించుకొని సూసైడ్ చేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

Telugu Hyderabadtech, Latest-Latest News - Telugu

29 సంవత్సరాలు ఉన్న వెంకట నాగలక్ష్మి ( Venkata Nagalakshmi )అని మహిళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరానికి చెందినది.ఈవిడ హైదరాబాద్ నగరంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది.ఐదు నెలల క్రితం నాగలక్ష్మి కి అదే జిల్లా మనోజ్ మణికంఠతో వివాహం జరిగింది.

వివాహం జరిగిన వీరు మొదట్లో బాగానే ఉన్నారు.వీరిద్దరూ మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో నివాసం కొనసాగిస్తున్నారు.

అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ మనస్పర్ధలు వచ్చాయో తెలియదు కానీ వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదు.ఈ నేపథ్యంలో భార్య నాగలక్ష్మి చనిపోవాలని డిసైడ్ కావడంతో ఆత్మహత్యకు ( commit suicide )పాల్పడింది.

ఇందుకోసం నవంబర్ 26న ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించిన మెటీరియల్ ని ఆన్లైన్లో తెప్పించుకుంది.

Telugu Hyderabadtech, Latest-Latest News - Telugu

ఆన్లైన్లో తెప్పించుకున్న విషయం బుధవారం ఆన్లైన్లో తెప్పించుకున్న విషం బుధవారం తాగింది.అయితే, విషయం తాగిన సమయంలో గమనించిన ఇంటి యజమాని ఆమె కుటుంబ సభ్యులు ప్రవేట్ ఆసుపత్రికి నాగలక్ష్మి తరలించారు.అయితే చికిత్స ప్రారంభించిన మరుసటి రోజు నాగలక్ష్మి మృతి చెందింది.

విషయం తెలుసుకున్న నాగలక్ష్మి కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ నగరానికి వచ్చారు.దాంతో తన కూతురిని వేధింపులు చేశాడని నాగలక్ష్మి భర్త పై ఆమె తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

అయితే ఈ ఆత్మహత్య వెనక అసలు విషయం తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube