అల్లు అర్జున్ ( Allu Arjun ) అభిమాని మరణించడంతో ఆ వివాదం ఈయన మెడకు చుట్టుకుందని చెప్పాలి.పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా విడుదల సమయంలో ప్రీమియర్ షో వేయగా అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు.
అయితే అదే సమయంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రాకతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో భాగంగా రేవతి( Revathi ) అనే మహిళ అభిమాని మరణించారు.
ఈమె అక్కడికక్కడే మరణించడంతో తన కొడుకు తీవ్ర గాయాలు పాలయ్యారు.ఇక ఆమె కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు ఇలా ఈయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విచారణ కోసం తమని అరెస్టు చేస్తున్నామంటూ ఆయన ఇంటికి వెళ్లారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్టు పట్ల అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
ఇక ఆ సమయంలో అల్లు అర్జున్ ఇంట్లోనే ఉండడంతో పోలీసులకు ఈయన సహకరించారు.ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావటాన్ని తన భార్య స్నేహారెడ్డి ( Sneha Reddy ) జీర్ణించుకోలేక పోయారు.ఈ క్రమంలోనే ఆమె ఎమోషనల్ కావడంతో అల్లు అర్జున్ తనకు ధైర్యం చెప్పి పోలీసులతో పాటు స్టేషన్ కి వచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అల్లు అర్జున్ అరెస్టు సమయంలో ఆయన తండ్రి అల్లు అరవింద్ అలాగే తమ్ముడు శిరీష్ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉన్నారు.ఇక విచారణ పేరుతో పోలీసులు ఈయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అయితే పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతలను ఏర్పాటు చేశారు.అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న ఉద్దేశంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలను చేపట్టారు.