అల్లు అర్జున్( Allu Arjun ) పై నమోదైన కేసు విషయంలో ఇప్పటికే షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.కోర్టు రిమాండ్ విధించడంతో ఈ కేసు విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.
అయితే రేవతి భర్త ( Husband of Revathi )తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను అంటూ రేవతి భర్త కామెంట్లు చేశారు.
రేవతి భర్త భాస్కర్ మాట్లాడుతూ బన్నీని విడుదల చేయాలని అన్నారు.ఈ ఘటనతో బన్నీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు.నా కొడుకు పుష్ప ది రూల్ సినిమా చూస్తానంటే సంధ్య థియేటర్ కు తీసుకెళ్లానని భాస్కర్ ( Bhaskar )పేర్కొన్నారు.ఈ ఘటన విషయంలో బన్నీ తప్పు లేదని ఆయన వెల్లడించారు.
బన్నీ అరెస్ట్ చేస్తున్నట్టు నాకు ఎలాంటి సమాచారం లేదని భాస్కర్ పేర్కొన్నారు.

నేను ఆస్పత్రిలో ఉన్నానని బన్నీ అరెస్ట్ వార్తను ఫోన్ లో చూశానని భాస్కర్ వెల్లడించారు.కేసు విత్ డ్రా చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.బన్నీ కేసు విషయంలో ప్రతి క్షణం ఉత్కంఠ నెలకొంటుండం గమనార్హం.
అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఒక సీఎం ఉన్నారని ప్రచారం జరుగుతోంది.బన్నీ అరెస్ట్ రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం.

తన కొడుకు శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదని భాస్కర్ చెబుతున్నారు.బన్నీ ఈ కేసు నుంచి త్వరగా బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.భాస్కర్ కుటుంబానికి బన్నీ మరింత అండగా నిలబడాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ కెరీర్ ప్లాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.ఆ ప్లాన్స్ పై ఈ అరెస్ట్ ప్రభావం పడనుంది.బన్నీ ఈ ఘటన వల్ల మానసికంగా కుంగిపోయాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.