Basra Temple : బాసర దేవాలయంలో ఆన్లైన్ అక్షరాభ్యాసాలు.. టికెట్ ధరలు ఎంత అంటే..

మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో బాసర దేవాలయం కూడా ఒకటి.చిన్నారులకు అక్షరభాస్యం అంటే తెలుగు రాష్ట్రాలలో ఎవరికైనా మొదటిగా గుర్తిచ్చేది బాసర సరస్వతి దేవాలయమే.

 Online Literacy Lessons In Basara Temple How Much Are The Ticket Prices ,basara-TeluguStop.com

ఈ దేవాలయంలో సరస్వతీ దేవి అక్షరాభాస్యల కోసం చిన్నారులతో వారి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు.ఈ దేవాలయంలో అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారి పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుతారని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

అయితే చాలా దూర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి వారి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించాలన్న వారికి సాధ్యం కానీ పరిస్థితి అప్పుడప్పుడు ఉంటుంది.ఈ నేపథ్యంలో వారి కోరికలను నెరవేర్చేందుకు బాసర ఆలయంలో ఆన్లైన్ అక్షరాభ్యాసాలకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ సందర్భంలో టికెట్ల ధరలను కూడా నిర్ణయించారు.దేశంలో నివసిస్తున్న వారితోపాటు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆన్లైన్ బుక్ చేసుకుంటే వారికి పూజ చేసిన వస్తువులను పోస్ట్ ద్వారా పంపించడానికి ఏర్పాట్లు కూడా చేశారు.

టికెట్ ధరలను గమనిస్తే బయటిదేశాల వారికి 2516 రూపాయలు.మన దేశంలో ఉన్నవారికి 1516 రూపాయలుగా నిర్ణయించినట్లు దేవాలయ శాఖ అధికారులు చెప్పారు.ప్రధానంగా ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలు ఆలస్యం కావడంతో పాటు సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు.

Telugu Bakti, Basara Temple, Devotional, Literacy, Ticket, Saraswatidevi-Telugu

భక్తులు ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని ఈ దేవాలయ అధికారులు ఆన్లైన్లో అక్షరాభ్యాసాలు పూజలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా వెల్లడించారు.వీటిని ఏ విధంగా చేయాలి తదుపరి అంశాలపై ఇటీవల ఆలయంలోని సిబ్బంది వేద పండితులతో ఈ దేవాలయ ఈవో విజయ రామారావు చర్చించే అవకాశం ఉంది.ఆన్లైన్ ధరలను ఈ విధంగా నిర్ణయించినట్లు సమాచారం.

అయితే ధరల ఆమోదం కోసం కమిషనర్ కు కూడా లేఖ రాశారు.అనుమతి రాగానే ఆన్లైన్లో అక్షరాభ్యాసాలు సరస్వతీ పూజ, నక్షత్రం వేద, ఆశీర్వచనం లాంటి ఎన్నో పూజలను కూడా చేయడానికి దేవాలయ అధికారులు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube