ఎండు ఖర్జూరం.( Dry Dates ) మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో ఒకటి.
వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఎండు ఖర్జూరం ప్రసిద్ధి చెందింది.ఎండు ఖర్జూరంలో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, ఫైబర్, ప్రోటీన్ తో సహా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యానికి ఎండు ఖర్జూరం ఒక వరమని అంటుంటారు.అసలు ఎండు ఖర్జూరం అందించే ప్రయోజనాలేంటి.? రోజుకు ఎన్ని తినొచ్చు.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడంలో ఎండు ఖర్జూరాలు తోడ్పడతాయి.నానబెట్టిన ఖర్జూరాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు.అలాగే వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మలబద్ధకం( Constipation ) సమస్యతో బాధపడుతున్నారు.అలాంటి వారికి ఎండు ఖర్జూరం న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.ఎండిన ఖర్జూరంలో ఫైబర్ మెండుగా ఉంటుంది.ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలో మరియు మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

మెదడు ఆరోగ్యానికి( Mental Health ) కూడా ఎండు ఖర్జూరం మద్దతు ఇస్తాయి.ఎండు ఖర్జూరంలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.అలాగే ఎండిన ఖర్జూరంలో సహజ చక్కెరలు ఉంటాయి.ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.నీరసం, బలహీనతను పోగొడతాయి.
ఎండు ఖర్జూరం మూత్రపిండాల్లో రాళ్లు( Kidney Stones ) ఏర్పడకుండా నిరోధించడంలో.క్యాన్సర్ కణాల పెరుగుదల మరియు వ్యాప్తిని అడ్డుకోవడంతో.మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సైతం అద్భుతంగా తోడ్పడతాయి.ఇక ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా కూడా ఎండు ఖర్జూరాలను అతిగా తీసుకోకూడదు.
రోజుకు రెండు నుంచి మూడు ఖర్జూరాలు మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.