మచ్చలు పోయి ముఖం అందంగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి!

ముఖ చర్మంపై ముదురు రంగు మచ్చలు( Dark spots ) అసహ్యంగా కనిపిస్తున్నాయా.? వాటిని వదిలించుకోవడం కోసం రకరకాల క్రీమ్‌, సీరంలు కొనుగోలు చేసి వాడుతున్నారా.? అయినా సరే మచ్చలు పోవడం లేదా.? డోంట్ వర్రీ.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు స్పాట్ లెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందించ‌డానికి అద్భుతంగా సహాయప‌డ‌తాయి.ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ కూడా ఆ కోవకే చెందుతుంది.

 This Home Remedy Helps To Get Rid Of Dark Spots! Dark Spots, Home Remedy, Skin C-TeluguStop.com

రెగ్యులర్ గా ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది.అందుకోసం ముందుగా ఒక చిన్న బంగాళాదుంప( potato ) తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వ‌న్‌ టేబుల్ స్పూన్ తులసి ఆకుల పొడి( Tulsi leaves powder ), వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ ( Orange Peel Powder )వేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin, Rem

అలాగే సరిపడా బంగాళాదుంప జ్యూస్ కూడా వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి.ఆ తర్వాత కూల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Spotless Skin, Rem

ప్రతినిత్యం ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.బంగాళదుంప, తులసి ఆరెంజ్ పీల్ లో ఉండే పలు సుగుణాలు మొండి మచ్చలకు వ్యతిరేకంగా పోరాడతాయి.క్రమక్రమంగా మచ్చలను మాయం చేస్తాయి.

అలాగే చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా మారుస్తాయి.అందంగా మెరిపిస్తాయి.

పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.స్కిన్ ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.

బంగాళాదుంపలోని విటమిన్ సి మరియు జింక్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.ముడ‌త‌ల‌ను నివారిస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube