1.జంతర్ మంతర్ లో ఏపీ సర్పంచుల ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీ జంతర్మంతర్ వద్ద ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ,ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.వీరి నిరసన కు ఎంపీ రఘురామకృష్ణంరాజు మద్దతు తెలిపారు.
2.పరిటాల సునీత అరెస్ట్
చిత్తూరు జిల్లా పుంగనూరు లో టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి దాడిలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన మాజీ మంత్రి పరిటాల సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు.
3.కేంద్రంపై కవిత విమర్శలు
మణుపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
4.డిసెంబర్ లోగా బీబీ ఎంపీ ఎన్నికలు
బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలు డిసెంబర్ లోగా నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు.
5.తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన ఆర్టీసీ బస్సు లు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితం అయ్యాయి.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే బస్సులు బంద్ చేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
6.కెసిఆర్ మద్యం దందా : బండి సంజయ్
తెలంగాణలో సీఎం కేసీఆర్( CM KCR ) కుటుంబం మద్యం దందా చేయబోతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు.
7.ఆధునిక ప్రమాణాలతో రైల్వేస్టేషన్ల అభివృద్ధి
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 2,079.29 కోట్లతో 50 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు.
8.హైదరాబాద్ లో సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాజధాని హైదరాబాదులో సుప్రీం శాశ్వత ధర్మసనం ఏర్పాటు చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభ లో ప్రైవేట్ సభ్యుడు బిల్ ప్రవేశపెట్టారు.
9.ఏపీ విద్యార్థినికి మెడికల్ వెబ్ ఆప్షన్
తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించిన కౌన్సిలింగ్ లో ఏపీ విద్యార్థినికి వెబ్ ఆప్షన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కాళోజి హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వాన్ని కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
10.ప్రొఫెసర్ హర గోపాల్ పిలుపు
ప్రజా ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అందుకోసం కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వారి న్యాయమైన హక్కులు పొంది సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.
11.అధ్యాపకుల సమస్యలు పరిష్కరిస్తాం
తెలంగాణలోని వెస్ట్రవిద్యాలయాల అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు.
12.వీఆర్ఏల సర్దుబాటుకు పోస్టులు
వీఆర్ఏల సర్దుబాటుకు రాష్ట్ర ఆర్థిక శాఖ 14,954 పోస్టులు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
13.డిండి పై 10 కోట్లు డిపాజిట్ చేయాలి
పర్యావరణ అనుమతులు లేకుండా డిండి ఎత్తిపోతలను నిర్మిస్తున్నందున తెలంగాణ ప్రభుత్వం 92.85 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ ఎన్ జి టి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది .మొత్తం 10 కోట్లను నాలుగు వారాల్లో ఎన్జీటీకి డిపాజిట్ చేయాలని షరతు విధించింది.
14.అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్ యూఐ ప్రయత్నం
గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్.యూఐ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది.ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
15.గ్రామపంచాయతీ అవార్డుల్లో కేంద్రం కుట్ర
గ్రామపంచాయతీలకు అందించే అవార్డుల్లో కేంద్రం కుట్రపూర్తంగా వ్యవహరిస్తుందని , లేదంటే ఇంకా ఎన్నో అవార్డులు రాష్ట్రానికి వచ్చేవని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
16.ప్రభుత్వ ఆసుపత్రులపై ఆర్డీవోల పర్యవేక్షణ
ప్రభుత్వ ఆసుపత్రిలో పాల్గొన వ్యవహారాల పర్యవేక్షణను ఆర్డీవోలకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
17.ఆర్టీసీ బిల్లుపై సమయం కావాలి : గవర్నర్
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం సర్వీసులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని మరికొంత సమయం కావాలని తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్( Tamilisai Soundararajan ) తెలిపారు.
18.ప్రైవేటు పీజీ వైద్య విద్య ఫీజులు రెట్టింపు
ప్రైవేటు వైద్య విద్య కళాశాలలో మెడికల్ డెంటల్ పీజీ సీట్ల ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచింది.
19.రుణమాఫీకి 1,379 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి 1,379 కోట్లు అవసరమని అధికారులు పేర్కొన్నారు.
20.ఓటర్ల నమోదుకు సహకరించాలి
ఓటరు జాబితాలో అర్హులైన వాటర్లను నమోదు చేయాలని అందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఎల్ఓ లకు సహకరించాలని దేవరకొండ ఆర్డిఓ శ్రీరాములు కోరారు.