5 ఏళ్ళ వయసులో అమ్మ, 14 ఏళ్ళ వయసులో నాన్నని కోల్పోయి చనిపోవాలి అనుకున్న: హీరో రాజా

ఓ చిన్నదాన సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజా, ఆనంద్, ఆ నలుగురు, వెన్నెల వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరచడంతో ఆయన హీరోగా కొనసాగలేకపోయారు.

 Actor Raja Revealed His Personal Life Secrets-TeluguStop.com

దానికి తోడు ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువ అవ్వడం కూడా రాజా సినిమాలు చేయకపోవడానికి కూడా ఒక కారణమని ఆయన అన్నారు.ప్రస్తుతం సినిమా రంగాన్ని వదిలేసి పాస్టర్ గా జీవితాన్ని గడుపుతున్న రాజా, తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.ఈ కార్యక్రమంలో తన జీవితంలో ఎదురైన సంఘటనలను, అవమానాలను, అనుభవాలను, తాను పడ్డ కష్టాలను, సినిమాలు వదిలేయడానికి గల కారణాలను వివరించారు.

 Actor Raja Revealed His Personal Life Secrets-5 ఏళ్ళ వయసులో అమ్మ, 14 ఏళ్ళ వయసులో నాన్నని కోల్పోయి చనిపోవాలి అనుకున్న: హీరో రాజా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దేళ్ల వయసులో తల్లిని కోల్పోయానని, 14 ఏళ్ల వయసులో తన తండ్రి ఆరోగ్యం పాడై చనిపోయారని తెలిపారు.తనను చిన్నప్పటి నుంచి తన ఇద్దరి అక్కలే చూసుకున్నారని, దేవుడు ఒక తల్లిని తీసుకుపోయినా ఆ స్థానంలో ఇద్దరు తల్లులను ఇచ్చాడని ఎమోషనల్ అయ్యారు.

ఇక తన సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ, ఫోటోలు, ఫైల్స్ పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడినని, ఆ సమయంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆఫీస్ కు వెళ్లినప్పుడు తనను ఘోరంగా అవమానించి పంపించేసినట్టు చెప్పుకొచ్చారు.ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నువ్వు పెద్ద అందగాడివని అనుకుంటున్నావా? అంటూ తమ్మారెడ్డి భరద్వాజ తనను నిరుత్సాహపరిచారని గుర్తు చేశారు.కానీ ఆయన మాట ఎలా ఉన్నా, ఆయన మనసు చాలా మంచిదని రాజా వెల్లడించారు.ఒక వంద రూపాయల కోసం చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు, అవమానపడిన రోజులు చాలానే ఉన్నాయని అన్నారు.

ఛీ ఛీ ఇదేం బతుకురా బాబు అని ఒకానొక సందర్భంలో విరక్తి కలిగిందని చెప్పుకొచ్చారు.అందరూ పుడతారు, అందరూ చస్తారు, నాకు అలాంటి బతుకు వద్దు, అలాంటి చావు వద్దు.

నేను బతికినా, చచ్చినా గొప్పగా ఉండాలి, అది ప్రపంచం మొత్తం తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి సినిమాల్లోకి వచ్చారట.ఆనంద్ సినిమా స్క్రిప్ట్ ను శేఖర్ కమ్ముల తనకు ఇచ్చినప్పుడు పూర్తిగా చదివానని, వెంటనే ఆయనకి కాల్ చేసి జాక్ పాట్ కొడతావని చెప్పానని అన్నారు.

కొన్ని సినిమాలు ఎందుకు చేశానురా బాబు అని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు.

ఒకసారి చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఓ పెద్దాయన గోదావరి సినిమా ఎందుకు చేయలేదని నిలదీశారని అన్నారు.కెరీర్ మొదట్లో సాఫీగా సాగినా, తర్వాత తన సినిమాలకు థియేటర్లు దొరికేవి కాదని, బడా నిర్మాతలతో గొడవలు కూడా దిగానని, కానీ తనకు బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో వాళ్ళను ఎదిరించి ఇండస్ట్రీలో కొనసాగలేకపోయానని అన్నారు.ఈ సంఘటనతో తనకు సినిమాల మీద విరక్తి కలిగిందని అన్నారు.

ఇండస్ట్రీలో పాలిటిక్స్ ఎక్కువని, అందుకే సినిమాలు చేయడం మానేశానని చెప్పుకొచ్చారు.ఆ తర్వాత అనుకోకుండా పాస్టర్ నయ్యానని అన్నారు.

తాను హీరో కాకముందు, హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గా పనిచేశానని గతాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.హీరోగా వచ్చి పాస్టర్ గా మారిన రాజా, విశాఖపట్నంలో జన్మించారు.2014 లో అమృతను వివాహం చేసుకున్నారు.వీరికి లియోరా అనే కూతురు కూడా ఉంది.

రాజా పాస్టర్ గా భారతదేశంలోనూ, అమెరికాలోనూ జరిగే క్రైస్తవ మీటింగ్ లకు అతిధిగా వెళ్ళి స్పీచ్ లిస్తుంటారు.ఏది ఏమైనా గాని ఒక మనిషి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా జీరో నుంచి హీరో స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

మరి అలాంటి రాజా, మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.

#RajaPersonal #Raja #Kokila #Alitho Saradaga #Ali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు