మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చిన ఒకే ఒక్క సినిమాతో సౌత్ లో బాగా పాపులర్ అయ్యింది.నార్త్ హీరోయిన్ అయినప్పటికీ ఈమె ఇక్కడ ఒక్క సినిమా తోనే అందరిని తన వైపుకు తిప్పుకుంది.
సీతారామం( Sita Ramam ) అనే హిట్ తో ఈ భామ సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిపోయింది.సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించిన ఈ అమ్మడి నటనకు అంతా ఫిదా అయ్యారు.
ఒక్క సినిమాతో ఇక్కడ ఫేమస్ అయిన ఈ బ్యూటీకి బాగానే అవకాశాలు వరిస్తున్నాయి.ప్రజెంట్ టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో తన సత్తా చూపిస్తున్న ఈ భామ ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధం అయినట్టు తెలుస్తుంది.కోలీవుడ్ ( Kollywood )లో అమ్మడికిఆ దిరిపోయే అవకాశం వచ్చిందట.శివ కార్తికేయన్ తాజా సినిమాలో మృణాల్ నే హీరోయిన్ గా ఎంపిక చేశారట.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూనిట్ సభ్యులు మృణాల్ ను ఎంపిక చేసారని ఇందులో నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ఈ బ్యూటీకి అవకాశం దక్కినట్టు తెలుస్తుంది.దీంతో పాటు ఈమెకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో డైవర్సిటీ ఆఫ్ సినిమా అనే అవార్డుకు మృణాల్ ఎంపిక అయ్యిందట.ఇలా ఈ భామకు ఒకేసారి జాక్ పాట్ తగిలినట్టే అని చెప్పాలి.
ఈమె ఈ అవార్డు ఎంపికపై ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.దీంతో ఫ్యాన్స్ ఈమెకు సోషల్ మీడియా( Social media ) వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.ప్రజెంట్ మృణాల్ నాని సరసన ”హాయ్ నాన్న” ( Hi Nanna )అనే సినిమాలో నటిస్తుంది.
డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.