ఎన్టీఆర్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న చిరు హిట్టు సినిమా ఏంటో తెలుసా?

చిరంజీవి కెరియర్లో అనేక హిట్టు సినిమాల్లో నటించారు కానీ దాంట్లో అల్లుడా మజాకా అనే ఓ చిత్రానికి సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టారని విషయం మాత్రం ఎవ్వరికి తెలియదు.అల్లుడా మజాకా సినిమాకి చిరంజీవి హీరోగా నటిస్తే రంభ, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటించారు.

 Unknown Facts About Chiranjeevi Alluda Majaka Movie , Chiranjeevi , Rambha, Ramy-TeluguStop.com

ఇక అత్త పాత్రలో ముందుగా వాణిశ్రీని అనుకున్నా కూడా ఆ డేట్స్ ప్రాబ్లం రావడంతో ఆ పాత్రలో సీనియర్ నటి లక్ష్మిని తీసుకున్నారు.ఈ చిత్రానికి దర్శకుడిగా ఇవివి సత్యనారాయణ పనిచేశారు.

ఇక ఈ చిత్రానికి నాంది పడింది మాత్రం నిర్మాత చేతుల పైననే.

అల్లుడా మజాకా సినిమా నిర్మాతగా కె.దేవివరప్రసాద్ ఉన్నారు.వరుస హిట్ సినిమాలు నిర్మించిన చరిత్ర దేవివరప్రసాద్ సొంతం.

ఘరానా మొగుడు, మంచి దొంగ, కొండవీటి రాజా, చట్టంతో పోరాటం వంటి సినిమాలు దేవి వరప్రసాద్ నిర్మాతగా, చిరంజీవి హీరోగా వచ్చాయి.ఈ చిత్రానికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి.

దర్శకుడుగా చిరంజీవితో ఈవీవీ కి ఉన్న ఏకైక సినిమా ఇదే కావడం విశేషం.దర్శకత్వం వహించడం.

ఇక హీరోయిన్ రంభ కూడా తొలిసారి చిరంజీవితో కలిసి ఈ సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాకి సీనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం కూడా అప్పట్లో సంచలన సృష్టించింది.

సాధారణంగా ఎన్టీఆర్ ఎవరి సినిమా ఫంక్షన్స్ కి అంత ఈజీగా రారు.

Telugu Chiranjeevi, Devi Varaprasad, Rambha, Ramya Krishna, Sr Ntr, Tollywood-Te

కానీ నిర్మాతకే దేవివరప్రసాద్ తో ఆయనకు మంచే సాన్నిహిత్య ఉంది దాంతో వరప్రసాద్ పిలువగానే ఎన్టీఆర్ కాదనలేకపోయారు.ఈవీవీ అప్పుల అప్పారావు అనే ఓ సినిమా తీయగానే చిరంజీవి తన ఇంటికి పిలిపించుకొని తనకు మంచి కథ సిద్ధం చేయమని చెప్పారట.అలాగే మరునాడే కే దేవి వరప్రసాద్ సైతం మా బ్యానర్ లో చిరంజీవి కోసం ఒక కథ రాయమని చెప్పడంతో ఈ రెండు సంఘటనలు ఈవీవీ ని ఈ చిత్రానికి దర్శకుడుగా మార్చాయి.ఈ సినిమా విడుదలైన తర్వాత ఘన విజయం సాధించింది.1994లో సీనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా క్లాప్ కొట్టించుకున్న ఈ సినిమా ఆ 1995 ఫిబ్రవరి 25న విడుదలై సంచలన విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube