దాయాది దేశం పాకిస్థాన్ ను వరదలు ముంచెత్తుతున్నాయి.దీంతో ప్రజాజీవనం అస్తవ్యస్థమైంది.వరదలతో 6.8 లక్షల ఇళ్లు నీట మునిగాయి.3,000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 150 వంతెనలు కూలిపోయాయి.సుమారు 3.3 కోట్ల మంది ప్రజలపై భారీ వర్షాలు, వరదల ప్రభావం పడినట్లు అంచనా.
ఖైబదర్ ఫక్తున్ క్వా, బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్సులలో 36 గంటల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి.క్వెట్టా, బలూచిస్థాన్ ప్రావిన్సులకు విమాన సేవలు కూడా రద్దయ్యాయి.ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితిని అత్యవసర సాయం కోసం పాక్ అభ్యర్థించింది.







