పాకిస్థాన్ ను ముంచెత్తుతున్న వ‌ర‌ద‌లు

దాయాది దేశం పాకిస్థాన్ ను వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి.దీంతో ప్ర‌జాజీవ‌నం అస్త‌వ్య‌స్థ‌మైంది.

వ‌ర‌ద‌లతో 6.8 ల‌క్ష‌ల ఇళ్లు నీట మునిగాయి.

3,000 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 150 వంతెనలు కూలిపోయాయి.సుమారు 3.

3 కోట్ల మంది ప్ర‌జ‌ల‌పై భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల ప్ర‌భావం ప‌డిన‌ట్లు అంచ‌నా.

ఖైబ‌ద‌ర్ ఫ‌క్తున్ క్వా, బ‌లూచిస్థాన్, సింధ్ ప్రావిన్సుల‌లో 36 గంట‌ల నుంచి భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇత‌ర ప్రాంతాల‌తో సంబంధాలు తెగిపోవ‌డంతో రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

చాలా చోట్ల రైలు సేవ‌లు నిలిచిపోయాయి.క్వెట్టా, బ‌లూచిస్థాన్ ప్రావిన్సుల‌కు విమాన సేవ‌లు కూడా ర‌ద్ద‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య‌స‌మితిని అత్య‌వ‌స‌ర సాయం కోసం పాక్ అభ్య‌ర్థించింది.