AR టెక్నాలజీ, VR టెక్నాలజీ గురించి నేటి యువతకు ప్రత్యేకించి వివరించాల్సిన పనిలేదు.అప్రయత్నంగానే వాటిని వాడుతున్నారు నేటి యువతీయువకులు.
ఓ రకంగా చెప్పాలంటే టెక్నాలజీ ఇపుడు మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది.ఇక వర్చువల్ రియాల్టీ వంటివి మనకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ మనుషులను కాస్త ఉద్వేగానికి గురయ్యేలా చేస్తుంది.ఈ క్రమంలోనే AR టెక్నాలజీ, VR టెక్నాలజీ అనేవి వృద్ధి చెందాయి.
అయితే ఈ రెండు విషయాల్లో ప్రజలకు కాస్త క్లారిటీ లేదు.ఇపుడు ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ రెండింటి మధ్య తేడా ఏంటో ఒకసారి చూద్దాం.
మన చుట్టూ ఉండే వాస్తవిక ప్రపంచానికి డిజిటల్ ఎలిమెంట్స్ ని జోడించి స్వల్ప మార్పులు చేసి ప్రేక్షకులకు ఈ టెక్నాలజీ ద్వారా వినోదాన్ని పంచుతున్నాయి ఆయా కంపెనీలు.ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తున్నారు.
ఒక లొకేషన్ లో సినిమా షూట్ అయిన తర్వాత దాన్ని ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఈ టెక్నాలజీలో మార్పులు చేస్తారు.ఉదాహరణకు బాహుబలి సినిమా లాంటివి ఇలాంటి టక్నాలజీతోనే రూపొందించారు.
మన చుట్టూ ఉండే వాస్తవ విషయాలకు దూరం జరగకుండా వాస్తవానికి దగ్గర పొలికలతో ఉండేలా చేయడాన్ని ఆగ్మెంటేడ్ రియాలిటీ అని పిలుస్తారు.

స్నాప్ చాట్ లెన్సెస్, పోక్ మన్ గేమ్ ఆగ్మెంటేడ్ రియాలిటీ కిందకే వస్తాయి.మన కళ్ళ ముందు లేని ప్రపంచంలోకి మనం వెళ్లిపోవడమే వర్చువల్ రియాలిటీ. దీనిలో ఉండే 3డీ టెక్నాలజీ కారణంగా మనం అందులోనే ఉన్న అనుభూతిని ఫీల్ అవుతాం.
డిజిటల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో.వీఆర్ డివైస్ ని పెట్టుకుంటే, ఆ ప్రపంచంలో మనం భాగం అనే అనుభూతిని అద్భుతంగా చూపిస్తారు.
వీఆర్ క్రికెట్, వీ ఆర్ ఫుట్ బాల్ వంటివి ఈ కోణంలోకి వస్తాయి.సినిమాల్లో కూడా ఈ టెక్నాలజీ క్రమంగా పెరుగుతుంది.