కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధులు ఏమిటి?

1.స్నాన విధి :– కార్తీక మాసంలో ప్రతిరోజూ కృత్తికా నక్షత్రం అస్తమించే లోగా, అంటే తెల్లవారు జామున స్నానం చేయాలి.నదీ స్నానం ఉత్తమం.అది వీలు కాని వారు కాలువలు, చెరువులు, బావులలోనైనా చేయవచ్చు.తులా మాసంలో గోవు పాదమంత జల ప్రదేశంలో కూడా శ్రీ మహా విష్ణువు ఉంటాడని ప్రతీతి.

 What Are The Duties To Be Performed In The Month Of Karthika , Devotional, Karth-TeluguStop.com

2.దీపవిధి :– కార్తీకంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వంటివి చేయాలి.కార్తీకమాసంలో సాయం కాలం శివాలయంలో గానీ, వైష్ణవాలయంలో గానీ, దీపాలు వెలిగించ వలెను.

ముఖ్యంగా కార్తీక పున్నమి నాడు తప్పక వెలిగించ వలెను.ఉసిరిక కాయపైన వత్తులను ఉంచి దీపం వెలిగించవచ్చు.నదులలో దీపాలను వదలడంతో పాటూ పండితుడికి దీపదానం ఇవ్వ వలెను.

3.ఉపవాసవిధి : కార్తీక మాసంలో శివుడికి ప్రియమైన సోమవారం నాడు ఉపవాస వ్రతాన్ని ఆచరించడం మంచిది.

4.వన భోజనం : కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలని శాస్త్ర వచనం.పలు జాతుల వృక్షాలు ఉన్న వనంలో ఉసిరిక చెట్టును పూజించాలి.

అనంతరం అదే చెట్టు కింద కూర్చుని పనస ఆకులో భోజనం చేయడం ఉత్తమం.చేయకూడని పనులు : కార్తీక మాసంలో వేడి నీటి స్నానం, పగటి నిద్ర, కంచు పళ్ళెంలో భోజనం, మాంస భక్షణం, ఇతరుల ఎంగిలి తినడం, వెల్లుల్లి, నీరుల్లి తినడం, ఇంట్లో స్నానం చేయడం వంటివి చేయ రాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube