బతుకమ్మ పండుగను అసలు ఎందుకు జరుపుకుంటారు, దాని కథ ఏమిటి?

What Is The Reason Behind We Celebrate Bathukamma Festival , Bathukamma, Devotional, Telengana, Bathukamma Festival, Paravthi, Lord Shiva

క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళా పరిపాలించాడు.అయితే తన తండ్రి వేములవాడలో ఉన్న శ్రీ రాజ రాజేశ్వర స్వామి భక్తుడు.

 What Is The Reason Behind We Celebrate Bathukamma Festival , Bathukamma, Devotio-TeluguStop.com

విషంయ తెలుసుకున్న ఆయన కుమారుడు రాజరాజ చోళా… గుడిని ధ్వంసం చేసి అందులో ఉన్న శివలింగాన్ని తమిళనాడుకు తీసుకెళ్లి తండ్రికి బహుమతిగా సమర్పించాడు.అయితే వేములవాడ నుంచి శివలింగాన్ని పార్వతి నుంచి వేరుచేసి తంజావూరుకు తరలించినందుకు తెలంగాణ ప్రజల మనసు కలచివేసింది.

బృహదమ్మ (పార్వతి) నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను, తమ దు:ఖాన్ని చోళులకు తెలియజేస్తూ.మెరూ పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలు పెట్టారు తెలంగాణ వాసులు.

అలా ప్రతి ఏడాది బతుకమ్మను జరపడం ఆనవాయితీగా మార్చుకున్నారు.దాదాపు 1000 సంవత్సరాల నుంచి బతుకమ్మను తెలంగాణ ప్రాంత ప్రజలు జరుపుకుంటున్నారు.

బతుకమ్మ పేరు కూడా బృహదమ్మ నుంచి వచ్చినదే.బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను రంగు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.

శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటున్నారు తెలంగాణ వాసులు.ఈ కథ చాలా కాలం నుంచి ప్రాశస్త్యంలో ఉంది.

Telugu Bathukamma Fest, Devotional, Lord Shiva, Paravthi, Telengana-Telugu Bhakt

బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ.పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది.ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు “బొడ్డెమ్మ” (మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మ) ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube