ఉప్పులో ఏకంగా ఇన్ని ర‌కాలున్నాయ‌ని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు

ఉప్పు ఎన్ని రకాలు? ఎన్ని రంగుల‌లో ఉంటుంద‌ని ఎవరైనా అడిగితే రెండుమూడు రకాల ఉప్పు గురించి చెప్పొచ్చు.కానీ మనం రోజూ వినియోగించే ఉప్పులో ఏకంగా 12 రకాలు ఉన్న‌య‌నే విష‌యం మ‌న‌కి తెలియ‌దు.అందుకే ఆ 12 ర‌కాలైన ఉప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 About12 Variety Of Salt And Their Use, 12 Varietyes, Salt , Sea Saltl , Black S-TeluguStop.com

1.టేబుల్ సాల్ట్:

ఇది సర్వసాధారణమైన ఉప్పు.ఇది నేల కింద కనిపించే సెలైన్ మూలకాల నుండి తయారు చేయబడుతుంది.

దీనిని సంగ్రహించిన తర్వాత, దానిలోని మలినాలను, ఖనిజాలను తొల‌గిస్తారు.దీనిలో అయోడిన్ కూడా కలుపుతారు.ఇది గాయిటర్‌కు సరైన చికిత్సగా పరిగణిస్తారు.

2.కోషెర్ సాల్ట్:

అమెరికాలో కోషెర్ సాల్ట్ వినియోగం ఎక్కువ‌గా ఉంటుంది.టేబుల్ ఉప్పు కంటే మందంగా ఉంటుంది.

ఇది మాంసాల‌పై చిలకరించడానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు.అలాగే, ఇది వేగంగా కరిగిపోతుంది.

అందుకే దీనిని ఏదైనా ఆహారంలో ఉపయోగించడానికి ఉత్త‌మ‌మైన‌దిగా పరిగణిస్తారు.

3.సముద్రపు ఉప్పు:

ఇది సముద్రపు నీటిని ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు.సముద్రపు ఉప్పు ఎక్కువగా శుద్ధి చేయరు.

టేబుల్ ఉప్పు కంటే పెద్ద గ‌డ్డ‌ల‌ను కలిగి ఉంటుంది.దీనిలో జింక్, పొటాషియం ఇనుము లాంటి ఖనిజాలు ఉండవచ్చు.

4.హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్:

ఈ ఉప్పు ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన ఉప్పుగా పరిగణిస్తారు.ఇది పాకిస్తాన్‌లోని హిమాలయ శ్రేణిలోని ఖేవ్డా ఉప్పు గనుల నుండి వెలికితీస్తారు.దీని రంగు అనేక షేడ్స్‌లో లేత తెలుపు, పింక్ రంగుల‌లో ఉంటుంది.

ఖనిజాల పరంగా ఇది చాలా మంచిది.ఇందులో శరీరానికి మేలు చేసే 84 ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

5.సెల్టిక్ సముద్ర ఉప్పు:

ఫ్రెంచ్‌లోసెల్ గ్రిస్అని కూడా పిలుస్తారు.అంటే బూడిద ఉప్పు.సెల్టిక్ సముద్రపు ఉప్పును ఫ్రాన్స్ తీరంలోని టైడల్ చెరువుల నుండి సంగ్రహిస్తారు.ఇది కొద్దిగా బూడిద బూడిద రంగులో ఉంటుంది.చేపలు, మాంసం వండడానికి ఇది ఉత్త‌మ‌మ‌ని భావిస్తారు.

6.ఫ్లూర్ డి సెల్:

దీని అర్థం ఉప్పు పువ్వు.ఇది ఫ్రాన్స్‌లోని బ్రిటనీ అనే ప్రదేశంలోని టైడల్ పూల్ నుండి సేకరిస్తారు.ఈ ఉప్పు త‌యారీ ప్ర‌క్రియ సూర్యుడు లేనప్పుడు, వేడి గాలి వీస్తున్నప్పుడు మాత్రమే జరుగుతుంది.

ఇది శ్రమతో కూడిన ప్రక్రియ.అందుకే దీని ఖరీదు ఎక్కువ‌గా ఉంటుంది.

ఇందులోని తేమ కారణంగా ఈ ఉప్పు కాస్త నీలిరంగులో క‌నిపిస్తుంది.ఇది మాంసం, సీఫుడ్, కూరలు, చాక్లెట్, పంచదార పాకం మొదలైన వాటిలో ఉపయోగించడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు.

7.నల్ల ఉప్పు: ఇది కూడా హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది.దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇది జీర్ణక్రియకు మంచిదని భావిస్తారు.

8.ఫ్లేక్ సాల్ట్:

దీనిని బాష్పీభవనం ద్వారా ఉప్పునీరు నుండి సంగ్రహిస్తారు.ఇది పలుచని పొరలు, ఏకరీతి కాని కణాల‌తో తెల్లగా ఉంటుంది.ఇందులో మినరల్స్ పరిమాణం తక్కువ.

9.బ్లాక్ హవాయి ఉప్పు:

బ్లాక్ లావా సాల్ట్ అని కూడా పిలుస్తారు.దీనిని కూడా సముద్రం నుండే సంగ్రహిస్తారు.యాక్టివేట్ చేసిన‌ బొగ్గు కారణంగా, ఇది ముదురు నలుపు రంగులో ఉంటుంది.దాని గ‌డ్డ‌లు సమానంగా ఉండవు.దీనిని పంది మాంసం, చేప‌ల‌తో చేసే ఆహారాల‌లో ఎక్కువ‌గా వినియోగిస్తారు.

10.రెడ్ హవాయి ఉప్పు:

ఇది శుద్ధి చేయని ఉప్పు.లేత ఎరుపు రంగులో ఉంటుంది.ఇది సాంప్రదాయ వంట‌కాల‌లో వినియోగిస్తారు.

11.స్మోక్డ్ సాల్ట్:

ఈ ఉప్పును రెండు వారాల పాటు వేడిచేసి త‌యారు చేస్తారు.ఫ‌లితంగా దీనిని ఆహారాల‌లో వినియోగించిన‌ప్పుడు స్మోకీ టెస్ట్ వస్తుంది.దీనిని మాంసాహారం, బంగాళాదుంపలతో చేసే వంట‌కాల‌లో వినియోగిస్తారు.

12.పిక్లింగ్ సాల్ట్:

దీనిని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.ఇది నిల్వ చేసిన ఆహారానికి ఎటువంటి హాని కలిగించదు.

Different Types of Salt and their Uses Types of Salt #Facts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube