అలాంటివారు ఈ గోల్డెన్ టెంపుల్ ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు..!

ముఖ్యంగా చెప్పాలంటే వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ ( Golden Temple )మరో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.అలాగే తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా దర్శనం చేసుకుంటున్నా దేవాలయాలలో ఒకటిగా ఈ గోల్డెన్ టెంపుల్ నిలిచింది.

 Such People Only Need To Visit This Golden Temple Once, Golden Temple Once, Bha-TeluguStop.com

ఈ దేవాలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద 1700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం( Shri Shakti Ganapati idol ) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ విగ్రహాన్ని 2021 జనవరి 25వ తేదీన ప్రతిష్టించారు.

తాజాగా ఇప్పుడు ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం( Crown ) అంత కంటే విశిష్టమైనదిగా నిలిచింది.ఈ కిరీటంలో పొదిగిన అరుదైన వైడూర్యం ప్రపంచంలోనే అతిపెద్ద వైడూర్యంగా రికార్డు సృష్టించింది.ఈ వజ్రం దాదాపు 880 క్యారెట్ల బరువు ఉంది.ఇప్పటి వరకు ప్రపంచ రికార్డ్స్ లో నిలిచినా అతి పెద్ద బరువు 700 క్యారెట్లు మాత్రమే అని స్థానిక పూజారులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే సహజంగా నవ రత్నాలకు ప్రత్యేక శక్తులు కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు.అలాగే తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ ప్రసాదింప చేస్తాయి అని చాలామంది భక్తులు నమ్ముతున్నారు.

ఆ విధంగా, నవరత్నాలలో ఒకటైన వైడూర్యం కేతు భగవాన్ శక్తిని ప్రసాదింప చేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్పష్టం చేశారు.అంతే కాకుండా ఎవరైతే ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణపతిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చని శ్రీ శక్తి అమ్మ తెలిపారు.అయితే తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు చాలా వరకు ఈ దేవాలయాన్ని తప్పకుండా దర్శిస్తున్నారని కూడా వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube