ఇంగువ( hing ).దీనినే ఆసుఫోటిడా అని, హింగ్ అని పిలుస్తుంటారు.
మన వంటింట్లో ఉండే సుగంధద్రవ్యాల్లో ఇంగువ ఒకటి.ముఖ్యంగా మన భారతీయ వంటల్లో ఇంగువను బాగా వినియోగిస్తుంటారు.
పులిహోర, పప్పు వంటి వంటకాల్లో ఇంగువ కచ్చితంగా పడాల్సిందే.వంటలకు చక్కని రుచి, ప్రత్యేకమైన ఫ్లేవర్ ను అందించడంలో ఇంగువ మహా దిట్ట.
పైగా ఆరోగ్యానికి కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుంది.వంటల్లో ఇంగువ వాడటం వల్ల గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం( Gas acidity constipation ) వంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇంగుద అద్భుతంగా సహాయపడుతుంది.శరీర బరువును తగ్గించడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇంగువ చక్కగా తోడ్పడుతుంది.అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ అతిగా ఇంగువను తీసుకుంటే మాత్రం తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇంగువ ఆరోగ్యానికి మంచిదే కానీ ఓవర్ గా వాడకూడదు.
ఎందుకంటే, ఇంగువ వల్ల లాభాలే కాదు నష్టాలు కూడా చాలా ఉన్నాయి.అతిగా ఇంగువను వాడితే తరచూ తల నొప్పిని( headache ) ఎదుర్కొంటారు.అలాగే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఇంగువను వీలైనంతవరకు మితంగా తీసుకోవాలి.ఇంగువ రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడేలా చేస్తుంది.కొందరికి ఇంగువ అసలు పడదు.ఇంగువ వేసిన వంటలను తింటే చర్మం పై దద్దుర్లు వచ్చేస్తుంటాయి.
అలాంటివారు ఇంగువను పూర్తిగా దూరం పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే అధికంగా ఇంగువను వినియోగించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.సంతాన సమస్యలు తలెత్తుతాయి.ప్రెగ్నెంట్ అయిన మహిళలకు గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇక ఇంగువను అతిగా తీసుకుంటే కండరాలు వాపులు వస్తాయి.కాబట్టి ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు అందించినప్పటికీ ఇంగువను మితంగానే తీసుకోవాలి.
అధిక వాడకం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి జాగ్రత్త!!
.