అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు జేడీ వాన్స్( JD Vance ).దీంతో ఆయన సతీమణి, తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరి వాన్స్ అగ్రరాజ్యానికి సెకండ్ లేడీగా నిలిచారు.
అంతేకాదు.సెకండ్ లేడీ హోదాను దక్కించుకున్న తొలి హిందూ మహిళగా, తొలి భారత సంతతి మహిళగా, తొలి దక్షిణాసియా వాసిగా నిలిచారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రుమన్‌కు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆల్బెన్ బార్ల్కీ భార్య జేన్ హాడ్లీ బార్ల్కీ( Hadley Barley ) (38) తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన సెకండ్ లేడీగా ఉష నిలిచారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉషా చిలుకూరి ( Usha Chilukoori )స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
దీంతో ఆమె ఎవరు? తల్లిదండ్రులు? ఎక్కడి నుంచి వచ్చారు? విద్యార్హతలు? జేడీ వాన్స్‌తో పెళ్లి? తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.దీంతో ఉషా చిలుకూరి గూగుల్ సెర్చ్‌లో టాప్ ట్రెండ్‌లో ( Google Search )నిలిచారు.
అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.ఆమె హిందూ, భారత మూలాలను పట్టుకుని ఉషపై జాత్యహంకార వ్యాఖ్యలు వస్తున్నాయి.ప్రమాణ స్వీకారం అనంతరం రిపబ్లికన్‌లను ఉద్దేశించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) మాట్లాడుతూ.ఉషా చిలుకూరి తెలివైన వ్యక్తని, అమెరికన్ చట్టాలు కనుక అనుమతించి ఉంటే ఆమెను ఉపాధ్యక్షురాలిగా చేసేవాడినని అన్నారు.
ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికాలోని విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మత: సంక్రమించే యూఎస్ సిటిజన్‌షిప్‌ను రద్దు ( Revocation of US citizenship )చేస్తూ ట్రంప్ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అడ్డు పెట్టుకుని కొందరు వ్యక్తులు ఉష హిందూ మతం, నేపథ్యం, భారతీయ మూలాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలో వైట్‌హౌస్‌లో ఆవు ఉంటుందా అంటూ ఉషను ఉద్దేశించి ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు.వీరికి కొందరు యూజర్లు గట్టిగా కౌంటరిస్తున్నారు.అమెరికా గొప్పతనం అదేనని.
మెలానియా ట్రంప్, ఉషా వాన్స్‌లు వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారని చెప్పారు.