నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో బిఆర్ఎస్ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు.శుక్రవారం నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ,పట్టణ సభలు ప్రజాగ్రహాన్ని చవి చూస్తున్నాయని,అందుకే ఇప్పుడు వచ్చిన జాబితా ఫైనల్ కాదని,మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారని,ఇప్పటికే ప్రజాపాలన పేరుతో గతంలో ప్రతీ ఒక్కరిని నుండి దరఖాస్తులు తీసుకున్నారని,మళ్ళీ మండల కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి మరోసారి దరఖాస్తులు తీసుకున్నారని అవి ఏమయ్యాయని,మళ్ళీ ఇప్పుడు ఇచ్చే దరఖాస్తులు ఏం చేస్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులకు కాకుండా,కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు ఇవ్వడంతో ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందన్నారు.అర్హులకు పథకాలు అందేలా ప్రజా పోరాటాలు చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ చల్లా కృష్ణారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు వెంకటాద్రి,వార్డు కౌన్సిలర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.