1.కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ
కృష్ణా నదీ యాజమాన్యం బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి పేరుతో ఈ లేఖ ఉంది.విద్యుత్ ఉత్పత్తికి సాగర్ నుంచి తెలంగాణ నీటి వినియోగం అడ్డుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.
2.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.సోమవారం తిరుమల శ్రీవారిని 66,112 మంది భక్తులు దర్శించుకున్నారు.
3.ఢిల్లీలో అమరావతి రైతు జేఏసీ నేతలు
అమరావతి రైతు జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
4.తాడేపల్లి లో కొనసాగుతున్న రైతుల నిరసన
తాడేపల్లి లో రైతుల నిరసన కొనసాగుతోంది.తమ భూములను రిజర్వ్ జోన్ నుంచి ఎత్తివేయాలని గత ఐదు రోజులుగా రైతులు నిరసన చేపట్టారు.
5.ఏబీ వెంకటేశ్వరరావు కు ఏపీ ప్రభుత్వం మెమో
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు ఏపీ ప్రభుత్వం మెమో జారీ చేసింది.గత నెల 21న ఏబీ వెంకటేశ్వరరావు పెట్టిన మీడియా సమావేశానికి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.మీడియాతో మాట్లాడటం పై వివరణ కోరుతూ చీఫ్ సెక్రటరీ షోకాజ్ నోటీసు ఇచ్చారు.
6. జగన్ ఢిల్లీ పర్యటన పై నారా లోకేష్ కామెంట్
పేలని జ’గన్ ‘పయనం ఎందుకు ? అంటూ సోషల్ మీడియా లో కామెంట్ చేశారు.
7.నిర్మల్ జిల్లాలో చిరుతల అలజడి
నిర్మల్ జిల్లాలో చరిత్ర సంచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది దీంతో పంట పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు.ఒకేరోజు మూడు చిరుతలు కనిపించడంతో పాటు, మరోచోట లేగదూడలను చంపి తినడం తో భయాందోళనకు గురవుతున్నారు.
8.నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతారు.
9.ఐపీఎల్ సమాచారం
నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది.రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
10.కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం సోనియా అధ్యక్షతన నిర్వహించనున్నారు.
11.లోక్ సభలో ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ
నేడు 16వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి లోక్ సభ లో ఉక్రెయిన్ దేశంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు.
12.నేడు అమిత్ షా తో జగన్ భేటీ
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ లో ఉన్నారు.ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ కానున్నారు.
13.ఖమ్మం జిల్లాలో రెండో రోజు షర్మిల యాత్ర
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలో రెండో రోజు కొనసాగుతోంది.
14.నేడు ప్రధానితో జగన్
నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు.
15.విశాఖ లో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పర్యటన
ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటించనున్నారు.ఆంధ్ర యూనివర్సిటీ గ్రామంలో జరుగుతున్న ప్రాంతీయ సదస్సు లో ఆమె పాల్గొననున్నారు.
16.టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
లోక్ సభ, రాజ్యసభ లో టీఆర్ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోలు వ్యవహారంపై సభలో చర్చకు పట్టుబట్టారు అనంతరం రెండు సభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
17.వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు
రాబోయే మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
18.బీజేపీ లో చేరిన టిఆర్ఎస్ నేత
టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్ నేడు బీజేపీ లో బండి సంజయ్ సమక్షంలో చేరారు.
19.నేడు యాదగిరి గుట్ట బంద్ కు వ్యాపారుల పిలుపు
నేడు యాదగిరి గుట్ట బంద్ కు స్థానికులు, వ్యాపారులు పిలుపునిచ్చారు.యాదాద్రి ఆలయ ఈవో గీత తీరుని నిరసిస్తూ గుట్ట బంద్ కు పిలుపునిచ్చారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,140
.