1.ఏపీ మంత్రుల ఎమర్జెన్సీ మీటింగ్
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఉత్తరాంధ్ర, తూర్పు సీమలో టిడిపి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో ముందుకు దూసుకు వెళ్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.
2.టి ఎస్ పి ఎస్ సి కీలక నిర్ణయం
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను కూడా టీఎస్పీఎస్సీ( TSPSC ) రద్దు చేసింది.గ్రూప్ వన్ ప్రిలిమ్స్ తో పాటు ఏ ఈఈ పరీక్ష పేపర్లను కూడా రద్దు చేస్తూ టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
3.రాహుల్ గాంధీ పై జేపీ నడ్డా విమర్శలు
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రస్థాయిలో విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం చాలా దురదృష్టకరం అంటూ రాహుల్ ను ఉద్దేశించి నడ్డా విమర్శించారు.
3.బండి సంజయ్ ధర్నా … అరెస్ట్
అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టుగా .పోలీసులు అరెస్ట్ చేశారు.
4.స్వప్నలోక్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు
స్వప్నలోక్ కాంప్లెక్స్( Swapnalok complex ) అగ్నిప్రమాద ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే.
5.పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
ఈరోజు ఏపీ అసెంబ్లీలో పదిమంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
6.పార్లమెంటు ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు సోమవారం నాటికి వాయిదా పడ్డాయి.
7.షర్మిల హౌస్ అరెస్ట్
లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
8.అచ్చెన్న నాయుడు కామెంట్స్
ఏపీ సీఎం జగన్ కి కర్ర కాల్చి వాతపెట్టేలా పట్టభద్రుల తీర్పు ఉందని టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు అన్నారు.
9.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి టిడిపి అదినేత చంద్రబాబు లేఖ రాశారు.
10.తిరుమల సమాచారం
తిరుమలలో( Tirumala ) భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది.గురువారం తిరుమల శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకున్నారు.
11.నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు
తిరుమల కొండపైకి నడిచి వెళ్లి భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి తెలిపారు.
12.ప్రధానితో భేటీ అయిన జగన్
ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు.ఏపీకి సంబంధించిన అనేక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
13.రెండో రోజు బట్టి విక్రమార్క పాదయాత్ర
అదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది.
14.రేవంత్ పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర నిజామాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది.
15.సిపిఎం జనచైతన్య యాత్ర
బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం తదితర అంశాలకు అనుకూలంగా నేటి నుంచి సిపిఎం ఆధ్వర్యంలో జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది.
16.టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవీఎన్ రెడ్డి గెలుపు
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన ఏబీఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గా గెలుపొందారు.
17.గవర్నర్ ను కలవనున్న బిజెపి నేతలు
టీఎస్ బీఎస్సీ పేపర్ లీక్ పై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ బిజెపి నేతలు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను కలవనున్నారు.
18.ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.
19.కాంతారా సినిమాకు అరుదైన గౌరవం
కాంతారా సినిమాకు
అరుదైన గౌరవం దక్కింది.నేడు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమా పాత్ర పై ప్రదర్శన తర్వాత ఈ సినిమా హీరో దర్శకుడు రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు.