ఈ మధ్య హీరోయిన్ లు ఫోటోషూట్ చేయించుకోవటంలో అసలు తగ్గట్లేరు.ఏదైనా కొత్త స్టిల్ వస్తే చాలు వెంటనే ఆ స్టిల్ తో ఫోటోలు దిగడానికి ముందుకు వస్తుంటారు.
అయితే ఈ మధ్య ట్రోల్స్ కు గురయ్యే స్టిల్స్ కూడా వస్తున్నాయి.అయినా కూడా సెలబ్రిటీలు మొహమాటం పడకుండా ఫోటోలు దిగుతున్నారు.
ఇక వెంటనే ట్రోల్స్ కు గురవుతున్నారు.తాజాగా లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) కూడా తన స్టిల్స్ తో బాగా ట్రోల్స్ కి గురైంది.
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి గురించి అందరికీ తెలిసిందే.తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరఖండ్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.అలా తొలిసారిగా 2008లో అందాల రాక్షసి( Andala rakshashi ) సినిమాతో హీరోయిన్ గా సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య.
అంతే కాకుండా హిందీలో, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.స్టార్ హీరోల సరసన సైతం నటించింది.ఆ మధ్య పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలు లావణ్యను నిరాశపరిచాయి.
ఈ మధ్య ఓటీటీ( OTT ) లో విడుదలయ్యే సినిమాలలో కూడా నటిస్తుంది.ఆ ప్లాట్ఫారం వేదికగా కొంతవరకు సక్సెస్ అందుకుంటుంది.
కానీ పెద్ద పెద్ద సినిమాలలో అంతగా అవకాశాలు అందుకోవటం లేదు.పైగా కొత్త హీరోయిన్ల రాకతో ఈ అమ్మడికి పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని అర్థమవుతుంది.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరిమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంటుంది.
ఇక తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.వారితో కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు నెగిటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఈ మధ్య పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగానే అందాలను ఆరబోస్తుంది.తన దృష్టి దర్శకనిర్మాతలపై పడాలని బాగా ప్రయత్నిస్తుంది.