టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.నాగార్జున గత సినిమా నా సామిరంగ బాక్సాఫీస్ వద్ద కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే కలెక్షన్లను సాధించినా ఆ సినిమా హిట్ అనే సంగతి తెలిసిందే.
కూలీ సినిమాకు లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ కాగా ఈ సినిమాలో స్టార్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే కూలీ సినిమా తెలుగు హక్కులను భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.
సన్ పిక్చర్స్ సంస్థ( Sun Pictures Company ) ఈ సినిమా కోసం 40 కోట్ల రూపాయలు కోట్ చేసిందని తెలుస్తోంది.ఎవరైనా ఈ సినిమా హక్కులు కావాలంటే ఆ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఆసియన్ సునీల్, నాగవంశీ ( Asian Sunil, Naga Vamsi )నుంచి ఈ సినిమా హక్కుల కోసం గట్టి పోటీ నెలకొందని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా.

ఈ ఇద్దరిలో ఎవరు హక్కులు సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.నాగార్జున గత సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని కూలీ రిలీజ్ తర్వాత నాగార్జున మార్కెట్ అమాంతం పెరగడం పక్కా అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నాగార్జున ఈ సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల రేంజ్ ( 25 crore range )లో రెమ్యునరేషన్ తీసుకున్నారని గతంలో వార్తలు వినిపించాయి.
కూలీ సినిమా రజనీకాంత్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

రజనీకాంత్ తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ ఏడాదే కూలీ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.కూలీ మూవీ థియేట్రికల్ రిలీజ్ కోసం అక్కినేని ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.








