పబ్లిక్ ప్రదేశాల్లో, ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్కుల్లో( restaurants, hotels, shopping malls, parks ) అనేక రకాల ప్రకటనా బోర్డులు కనిపిస్తుంటాయి.వీటిలో కొన్ని సాధారణ సూచనల కోసం ఉండగా, మరికొన్ని వినోదాత్మకంగా, కొద్దివరకు కఠినంగా, ప్రజలను ఆకట్టుకునేలా ఉంటాయి.
ఆహారాన్ని వృథా చేయొద్దు, ఫోన్‌లు మ్యూట్‌లో పెట్టండి, పెంపుడు జంతువులను లోపలికి అనుమతించం వంటి బోర్డులు చాలా సాధారణం.అయితే, కొన్నిచోట్ల వినూత్నమైన, ఆశ్చర్యపరిచే విధమైన బోర్డులు ప్రజలను ఆకర్షించడంతోపాటు, సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్‌గా మారుతుంటాయి.

ఇటీవల బెంగుళూరులోని ‘పాకశాల’ ( ‘Pakasala’ in Bangalore )అనే రెస్టారెంట్ ప్రత్యేక రూల్ పెట్టింది.సాధారణంగా రెస్టారెంట్‌కు కస్టమర్లు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు గంటల తరబడి వివిధ విషయాలపై చర్చలు సాగిస్తారు.ముఖ్యంగా సినిమాలు, రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వంటి అంశాలపై చర్చలు తప్పనిసరి.అయితే, ఈ రకమైన చర్చల వల్ల ఇతర కస్టమర్లకు అసౌకర్యం కలుగుతుందన్న కారణంతో పాకశాల రెస్టారెంట్ యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు “రెస్టారెంట్‌లో రాజకీయాలు, సినిమాలు, ఇతర చర్చలు చేయొద్దు” అంటూ స్పష్టమైన బోర్డ్‌ను ఏర్పాటు చేసింది.రెస్టారెంట్‌లో గంటల తరబడి కూర్చుని గట్టిగా మాట్లాడటం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ వినూత్న బోర్డ్ ఫోటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అది కాస్త వైరల్ అయింది.నెటిజన్లు ఈ విషయంపై విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.కొందరు రెస్టారెంట్ నిర్ణయాన్ని అభినందిస్తుంటే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.ఇది సరైన నిర్ణయమే అని కొందరు కామెంట్ చేస్తుండగా.మరికొందరేమో.తింటున్నప్పుడు ఈ విషయాలు కాకుండా కార్టూన్ చానెల్ గురించి మాట్లాడలా? అంటూ ఆగ్రహించుకుంటున్నారు
.






