మగ్గాళ్లు వింటున్నారా..? 'భర్తల డే కేర్‌ సెంటర్‌' చూసారా?

పెళ్లి అనేది కేవలం రెండు మనుషుల సంబంధం మాత్రమే కాదు.ఇది రెండు మనసుల కలయిక, రెండు కుటుంబాల అనుబంధం.

 Are You Listening, Guys Have You Seen 'husbands' Day Care Center', Husband And W-TeluguStop.com

భార్య భర్తల మధ్య ప్రేమ, నమ్మకం, ఓర్పు, అర్ధం చేసుకోవడం వంటి అంశాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి.సాధారణంగా ఈ సంబంధంలో కొన్ని అనేక ఫన్నీ, వినోదాత్మక, ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ముఖ్యంగా, భార్య భర్తల మధ్య షాపింగ్‌ ఎపిసోడ్స్( Shopping episodes ) చాలా మందికి సుపరిచితమే.భార్యలు షాపింగ్‌కు వెళ్లినప్పుడు భర్తలు ఎదుర్కొనే పరిస్థితులు ఎప్పటికీ చర్చకు తెరలేపుతూనే ఉంటాయి.

భార్యలతో షాపింగ్‌కి వెళ్లినప్పుడు భర్తలు పడే కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.షాపింగ్‌ మాల్‌లో గంటల తరబడి తిరుగుతూ, ఒక్క దుకాణం నుంచి మరో దుకాణానికి మారుతూ, చివరికి పెద్ద బిల్లుతో ఇంటికి తిరిగి రావడం ఎంతోమందికి ఎదురైన అనుభవమే.

ఈ సందర్భాలను చూపించే ఫన్నీ వీడియోలు, రీల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో ప్రతీ రోజూ దర్శనమిస్తుంటాయి.

Telugu Creative, Boards, Guyshusbands, Relationship, Struggles, Humor, Experienc

ఇటీవల, ఇలాంటి ఫన్నీ సంఘటనతో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోలో షాపింగ్ మాల్ బయట కనిపించిన ఒక వినూత్న బోర్డు అందరినీ ఆకట్టుకుంటోంది.ఆ బోర్డు మీద “మీరు షాపింగ్‌కి వెళ్లినా, మరెక్కడికైనా వెళ్లినా, మీ భర్తలను ఇక్కడ వదిలిపెట్టండి” అని రాసి ఉంది.

అంతేకాదు, అక్కడ కోల్డ్ బీరు అందుబాటులో ఉందని, రగ్బీ చూడొచ్చని కూడా ప్రస్తావించారు.

Telugu Creative, Boards, Guyshusbands, Relationship, Struggles, Humor, Experienc

ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అయింది.సాధారణంగా పిల్లలను కేర్ సెంటర్లలో( Children in care centers ) వదిలిపెడుతుంటారు.కానీ, భర్తల కోసం ప్రత్యేకంగా డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం నెటిజన్లను తెగ నవ్విస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు “ఇకపై భార్యలు షాపింగ్‌ చేస్తే భర్తలకు అసలైన పండుగ” అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరేమో మనదేశంలో కూడా ఇలాంటిది ఒకటి పెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ తమ ఆలోచనలను పంచుకున్నారు.

ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు మళ్లీ మళ్లీ చూసేవారికి నవ్వు తెప్పిస్తాయి.ముఖ్యంగా, భార్య భర్తల మధ్య ఉండే పంచాయతీని ఈ విధంగా వినోదాత్మకంగా చూపించడం అందర్నీ ఆకర్షిస్తోంది.

ఈ వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube