అందంగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం చాలా మంది మేకప్( Makeup ) ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు.మేకప్ తో చర్మానికి మెరుగులు పెడుతూ సహజ అందంపై దృష్టి సారించడం మర్చిపోతున్నారు.
అయితే తరచూ మేకప్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది.భవిష్యత్తులో రకరకాల చర్మ సమస్యలు( Skin Problems ) తలెత్తే అవకాశాలు ఉంటాయి.
కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని ప్రయత్నిస్తే మేకప్ అక్కర్లేదు.న్యాచురల్ గానే సూపర్ గ్లోయింగ్ గా, బ్యూటిఫుల్ గా మెరిసిపోతారు.
పైగా ఈ రెమెడీతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు,( Bengal Gram ) చేతినిండా గులాబీ రేకులు( Rose Petals ) మరియు అరకప్పు పచ్చి పాలు( Milk ) వేసుకొని బాగా మిక్స్ చేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టుకున్న శనగపప్పు, గులాబీ రేకులను పాలతో సహా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ తేనె,( Honey ) వన్ టీ స్పూన్ బియ్యం పిండి, వన్ టీ స్పూన్ ముల్తానీ మట్టి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ అనేది ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది.
చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి.

అలాగే ఈ రెమెడీ చర్మంపై మచ్చలను తగ్గిస్తుంది.పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెడుతుంది.స్కిన్ కలర్ ను ఈవెన్ గా మారుస్తుంది.అంతేకాకుండా ఈ రెమెడీ చర్మానికి కొత్త మెరుపులు జోడిస్తుంది.సహజంగానే అందంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి మేకప్ ను పక్కన పెట్టి న్యాచురల్ స్కిన్ గ్లో కోసం ఈ రెమెడీని ప్రయత్నించండి.







