సీజన్ మారుతున్నప్పుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో జలుబు, దగ్గు( Cold, Cough ) ముందు వరుసలో ఉంటాయి.ఇవి చిన్న సమస్యలే అయినా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటాయి.
ఏకాగ్రతను దెబ్బతీస్తాయి.రాత్రుళ్లు నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయి.
మనల్ని బలహీనంగా మారుస్తాయి.మీరు కూడా జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ మీకోసమే.ఈ డ్రింక్ సీజనల్ గా ఇబ్బంది పెట్టే జలుబు, దగ్గు సమస్యల నుంచి వేగంగా రికవరీ అవ్వడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.
డ్రింక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అందులో మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు( Biryani Leaves ) వేసుకోవాలి.
అలాగే అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) నాలుగు దంచిన మిరియాలు( Black Pepper ) వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయ్యాక తాగేయడమే.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ డ్రింక్ ను తీసుకోవాలి.ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి.ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.వైరల్ ఇన్ఫెక్షన్లకు( Viral Infections ) వ్యతిరేకంగా పోరాడుతాయి.జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యల నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు తోడ్పడతాయి.ఈ డ్రింక్ ను కనుక తాగితే కేవలం రెండు రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

అలాగే ఈ డ్రింక్ లో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే ఎంజైమ్‌లు ఉంటాయి.అందువల్ల రెగ్యులర్ డైట్ లో ఈ డ్రింక్ ను చేర్చుకుంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.అంతేకాకుండా ఈ డ్రింక్ బాడీ పెయిన్స్ నుంచి రిలీఫ్‌ను అందిస్తుంది.మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.







