నేటి ఆధునిక కాలంలో ధూమపానం( smoking ) అనేది అత్యంత సర్వసాధారణం అయిపోయింది.వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు.
కాలక్రమేణా అది వ్యసనంగా మారిపోతుంది.ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ.
ఆ అలవాటును మాత్రం వదులుకోలేకపోతున్నారు.పైగా ఈ మధ్య మగవారితో పాటు ఆడవారు కూడా స్మోక్ చేయడం మొదలు పెట్టారు.
పొగాకు ఉత్పత్తులలో అసిటోన్, టార్, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి అసురక్షిత పదార్థాలు ఉంటాయి.ఇవి ఊపిరితిత్తులు మరియు శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తాయి.
ధూమపానం శరీరం అంతటా వాపును పెంచుతుంది.రోగనిరోధక వ్యవస్థను( immune system ) బలహీన పరుస్తుంది.తరచూ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యేలా చేస్తుంది.అలాగే ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కొలెరెక్టల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ఒరోఫారింజియల్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
పైగా స్మోకింగ్ చేసే స్త్రీ పురుషులకు( mens ) పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయని కొన్ని పరిశోదనల్లో తేలింది.పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్( Nicotine ) పురుషులు మరియు స్త్రీల జననేంద్రియ ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.అలాగే ధూమపానం సంతానోత్పత్తి సమస్యలకు దారి తీస్తుంది.మగ మరియు ఆడవారిలో సెక్స్ హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది.లైంగిక కోరికలను దెబ్బ తీస్తుంది.
అంతేకాదు స్మోకింగ్ చేయడం వల్ల రక్త నాళాల పనితీరు నెమ్మదిస్తుంది.ఇది పురుషుల్లో అంగస్తంభన కు దారితీయవచ్చు.లేదా వీర్య కణాల్లో సంఖ్య మరియు నాణ్యత తగ్గుముఖం పడుతుంది.
ధూమపానం వల్ల ఆడవారిలో హార్మోన్ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది.ఇది గర్భం దాల్చడాన్ని కష్టతరం చేస్తుంది.
ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా గర్భస్రావం మరియు కొన్ని పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది.మరొక షాకింగ్ విషయం ఏంటంటే.
ధూమపానం చేయనివారి కంటే ధూమపానం చేసేవారిలోనే మెనోపాజ్ ముందుగా సంభవిస్తుందని తేలింది.కాబట్టి ఇకనైనా స్మోకింగ్ అలవాటును మానుకోండి.
ఆరోగ్యాన్ని కాపాడుకోండి.