తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకు వెళుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది హీరోలు మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ ని సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
ముఖ్యంగా మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి హీరో అయితే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినప్పటికి ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ ని సాధించలేకపోయాడు.ఇక ఇప్పుడు ‘కన్నప్ప’ ( Kannappa ) సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలేవి ఆయనకు గొప్ప గుర్తింపును ఆయితే తీసుకురాలేదు.కానీ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచు సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు అందరికీ పోటీ ఇచ్చే విధంగా మంచు విష్ణు ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) ఉండడం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది.మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పటికి రీసెంట్ గా వచ్చిన టీజర్ సైతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచేసింది…చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది.తద్వారా మంచు విష్ణు కి ఎలాంటి గుర్తింపు రాబోతుంది అనేది…
.







