బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో హైపర్ ఆది( Hyper Aadi ) ఒకరు జబర్దస్త్( Jabardasth ) కార్యక్రమంలో అదిరే అభి టీం లో కమెడియన్ గా పనిచేస్తున్న ఆది అనంతరం టీం లీడర్ గా మారిపోయారు ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.అదేవిధంగా మరోవైపు వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు .
ఇక హైపర్ ఆది పంచ్ డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయో మనకు తెలిసిందే.ఈయన షో లో ఉన్న జడ్జిలతో పాటు ఇతర ఆర్టిస్టులు అలాగే పొలిటికల్ లీడర్స్ పై కూడా పంచులు వేస్తూ ఉంటారు.

ఇక స్టేజ్ పైకి ఎవరైనా కొత్త అమ్మాయి వస్తే వెంటనే వారితో పులిహోర వేషాలు కూడా వేస్తూ ఉంటారు.అయితే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన వారిలో సౌమ్యరావు ( Sowmya Rao ) ఒకరు తాజాగా ఈమె హైపర్ ఆది గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా సౌమ్య రావుతో కూడా హైపర్ ఆది చాలా చనువుగా ఉండటంతో వీరిద్దరి గురించి ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి.తాజాగా సౌమ్యరావు ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టేశారు.

హైపర్ ఆదితో తనకు ఏదో రిలేషన్ ఉంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.అది నేను ఇద్దరం ఒకే చోట పని చేశాం. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని తెలిపారు.ఇక ఎవరైనా కొత్త అమ్మాయి షోలోకి వచ్చింది అంటే ఆది వారితో పులిహోర కలుపుతుంటాడు.అలాగే కొత్త అమ్మాయిలపై పంచులు అతిగా వేసి నవ్వించే ప్రయత్నం చేస్తాడు.ఇదంతా స్క్రిప్ట్ ను పండించడంలో భాగంగానే చేస్తుంటాడని చెప్పింది.
ఇక ఆఫ్ స్క్రీన్ తాను చాలా మంచి వ్యక్తని తనకు చాలా సపోర్టివ్ గా నిలిచారు అంటూ సౌమ్యరావు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







