టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉందనే చెప్పాలి.ఇలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ తనని తాను నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
ఇదిలా ఉండగా నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం( International Women’s Day ) కావడంతో చిరంజీవి ఇటీవల తన తల్లి అలాగే తన చెల్లెలు నాగబాబుతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కుమార్తె శ్రీజ( Sreeja ) విడాకుల( Divorce ) గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన తల్లి అంజనాదేవి ( Anjana Devi ) గురించి ఎంతో గొప్పగా చెప్పారు.అమ్మకు నాగబాబు అంటే చాలా ఇష్టమని ఇప్పటికీ కూడా వాడిని దగ్గరికి తీసుకొని నుదుటిపై ముద్దులు పెడుతుందని తెలిపారు.ఇక అమ్మ అంటే శ్రీజ కూడా చాలా ఇష్టం శ్రీజా తన జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్న కచ్చితంగా తన నాన్నమ్మ సలహా తీసుకుంటుందని చిరంజీవి తెలిపారు.ముఖ్యంగా విడాకుల సమయంలో శ్రీజ మా అమ్మ సలహా తీసుకుందని ఆ సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి శ్రీజ వెళ్ళిపోయింది అని తెలిపారు.

ఇలా రెండుసార్లు విడాకులు తీసుకున్న సమయంలో శ్రీజ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు చిరంజీవి గుర్తు చేసుకున్నారు.శ్రీజ తన జీవితానికి సంబంధించిన ఏ విషయం అయిన శ్రీజ నానమ్మ సలహా తీసుకొని ముందుకు వెళుతుంది.ఇక విడాకుల గురించి నా తల్లి అంజనమ్మ దగ్గర శ్రీజా ఈ విషయం చెప్పిన సమయంలో ఎవడో ఒకడి గురించి నీ లైఫ్ ఇక్కడితో ఆగిపోకూడదు.నువ్వు ముందుకు వెళ్లాలి అంటూ తనలో ధైర్యాన్ని నింపారు.
ఇలా మా విషయంలో కూడా చిన్నప్పటినుంచి అమ్మ మాలో ఎంతో ధైర్యాన్ని నింపి మమ్మల్ని ప్రోత్సహించింది అని చిరు తెలిపారు.అయితే శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని తన ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇలా భర్తలకు దూరమైన ఈమె తన ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు.







