సినీ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటూ ఉన్నారు.
ఇక ఇటీవల క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక త్వరలోనే కిరణ్ అబ్బవరం దిల్ రుబా( Dil Ruba ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా మార్చి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమాలో కిరణ్ అబ్బవరానికి జోడీగా నటి రుక్సార్ థిల్లాన్( Rukhsar Dhillon ) హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇతర అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలనే పెంచేసాయి.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జీవితంలో ఏదో ఒకటి పెద్దగా సాధించాలనే కోరిక బలంగా ఉండేది నాకు.అందులో భాగంగానే హీరో కావాలనుకున్నాను.కానీ నాకు రాజకీయాలు ( Politics ) అంటే కూడా చాలా ఇష్టమని తెలిపారు.
నేను రాయలసీమకు చెందిన వ్యక్తిని చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తూ పెరిగాను.ఒకవేళ సినిమాలలోకి రాకపోయి ఉంటే కనుక కచ్చితంగా రాజకీయాలలోకి వెళ్లే వాడినని కిరణ్ అబ్బవరం తెలిపారు.
మంచి, చెడు పక్కన పెట్టి ప్రజలతో మమేకం అవ్వడం గొప్ప విషయం.అది నాకు నచ్చుతుంది.అందుకే నాకు రాజకీయాలపై ఆసక్తి ఎక్కువ.అతి త్వరలోనే తాను వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నానని తెలిపారు.
రాయలసీమ స్టైల్ లో ఆహారాన్ని ఇక్కడ వారికి అందించాలన్న ఉద్దేశంతో రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నానని త్వరలోనే ఆ విషయాలన్నింటిని కూడా బయట పెడతానని కిరణ్ అబ్బవరం తెలిపారు.







