స్ట్రెచ్ మార్క్స్.ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు కామన్‌గా ఎదుర్కొనే సమస్యల్లో ఇది ఒకటి.
బరువు హెచ్చు తగ్గుల వల్ల కూడా కొందరు ఈ సమస్యను ఎదుర్కొంటారు.పొట్ట, కాళ్లు, చేతులు, నడుము భాగాలపై స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువగా ఏర్పడతాయి.
దాంతో చర్మం అందాన్ని కోల్పోతుంది.ఈ క్రమంలోనే స్ట్రెచ్ మార్క్స్‌ను నివారించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
అయితే కొందరిలో ఎన్ని చేసినా, ఎన్ని పూసినా ఫలితం ఉండదు.కానీ, ఎటువంటి స్ట్రెజ్ మార్క్స్‌కు అయినా చెక్ పెట్టడంలో కాఫీ పొడి గ్రేట్‌గా సహాయపడుతుంది.
మరి కాఫీ పొడిని ఎలా యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కాఫీ పొడి, నిమ్మ రసం మరియు కలబంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసి.పది నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే క్రమంగా స్ట్రెచ్ మార్క్స్ దూరం అవుతాయి.
![Telugu Benefitscoffee, Coffee Powder, Latest, Skin Care, Stretch-Telugu Health - Telugu Benefitscoffee, Coffee Powder, Latest, Skin Care, Stretch-Telugu Health -](https://telugustop.com/wp-content/uploads/2021/05/Coffee-Powder-Remedies-for-Stretch-Marks.jpg)
అలాగే ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ పెరుగు మరియు అర స్పూన్ తేనె వేసి కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్ మార్క్స్ పై పూసి.పావు గంట తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే.స్ట్రెచ్ మార్క్స్ మటుమాయం అవుతాయి.
ఇక ఈ టిప్స్‌తో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.
ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట ఆల్మండ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.జింక్ అధికంగా లభించే ఆహార పదార్థాలు స్ట్రెచ్ మార్క్స్ ను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
కాబట్టి, జింక్ అధికంగా ఉండే ఆహారాలను డైట్‌లో చేర్చుకోండి.