బెంగళూరు మెట్రో స్టేషన్‌లో (Bangalore Metro)ఒక జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.ప్రజలందరూ చూస్తుండగానే ఆ జంట రెచ్చిపోయి ప్రవర్తించడంతో వీడియో వైరల్ అయిపోయింది.
ఈ ఘటన మదావర మెట్రో స్టేషన్‌లో (Madavara Metro Station)జరిగింది.దీంతో పబ్లిక్ ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలి, సభ్యత అంటే ఏంటి అనే విషయాలపై మళ్లీ చర్చ మొదలైంది.‘కర్ణాటక పోర్ట్‌ఫోలియో’(‘Karnataka Portfolio’) అనే యూజర్ X (ట్విట్టర్)లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.ప్లాట్‌ఫాంపై ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఒక జంట అందరూ చూస్తుండగానే శ్రుతి మించిన పనులు చేస్తూ కనిపించింది.
అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, ముసలివాళ్లు కూడా ఉన్నారు.వాళ్లందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా ఆ జంట ప్రవర్తించిన తీరు అందర్నీ షాక్‌కి గురిచేసింది.కొంతమంది అయితే అసౌకర్యంగా ఫీలయ్యారు, వీడియోలో చూడొచ్చు.
“బెంగళూరు ఢిల్లీ మెట్రో (Bangalore Delhi Metro)సంస్కృతి వైపు వెళ్తుందా, ఈ మెట్రో స్టేషన్‌లో సభ్యత లేకుండా ప్రవర్తించడం వల్ల బెంగళూరు పరువు పోతోంది?” అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశారు.క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ అయిపోయింది.ఇప్పటికే 3.5 లక్షల మందికి పైగా దీన్ని చూసేశారు.చాలామంది నెటిజన్లు ఈ జంటపై సీరియస్ గా ఫైర్ అవుతున్నారు.వెంటనే వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.“స్టేషన్‌లో గార్డ్స్ ఏం చేస్తున్నారు? వాళ్లని ఎందుకు ఆపలేదు?” అని ప్రశ్నిస్తున్నారు.“ఇదేనా మనం మన పిల్లలకు నేర్పించేది?” అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.“ఇప్పుడేమో మెట్రో స్టేషన్లు (Metro stations)కూడా డేటింగ్ స్పాట్‌లుగా మారిపోతున్నాయి” అని ఇంకొందరు విమర్శిస్తున్నారు.
ఇలాంటి చేష్టల వల్లే వయసు పైబడిన వాళ్ళు రద్దీగా ఉండే టైంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో (public transport)రావాలంటే భయపడుతున్నారని ఒక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.“ఇది ప్రేమ కాదు.సిగ్గులేనితనం” అని ఇంకొకరు ఘాటుగా కామెంట్ చేశారు.అయితే, కొందరు మాత్రం వీడియో తీసి షేర్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.“తప్పు చేసినవాళ్ళని వీడియో తీయడం కూడా తప్పే కదా” అని అంటున్నారు.“సభ్యత గురించి మాట్లాడే నువ్వేమో వాళ్ల మొహాలు బ్లర్ చేయకుండా వీడియో పెట్టావు” అంటూ ఇంకొకరు ప్రశ్నించారు.మొత్తానికి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.