బెంగళూరుకు ( Bengaluru ) చెందిన టెక్ నిపుణురాలు ప్రతిమ్ భోసలే,( Pratim Bhosale ) ఆరు నెలల పాటు ఆమ్‌స్టర్‌డామ్‌లో( Amsterdam ) నివసించిన తర్వాత తన అనుభవాలను ఎక్స్‌లో పూసగుచ్చినట్లు పంచుకున్నారు.ఆమ్‌స్టర్‌డామ్, బెంగళూరు నగరాల మధ్య జీవితాన్ని పోలుస్తూ ఆమె చేసిన పోస్ట్ దాదాపు 8 లక్షల వ్యూస్‌తో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ముందుగా అద్దె ఇళ్ల గురించి చెబుతూ, ఆమ్‌స్టర్‌డామ్‌లో ఇల్లు వెతకడం ఒక భయంకరమైన టాస్క్ అని ప్రతిమ్ అన్నారు.ఓ మోస్తరు ప్రాంతంలో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కు నెలకు సుమారు 2,000 యూరోలు (దాదాపు రూ.1.8 లక్షలు) అద్దె కట్టాల్సిందేనట.ఇల్లు దొరకడం ఎంత కష్టమో కానీ, ఇండియాలో పోలిస్తే నెదర్లాండ్స్‌లో( Netherlands ) అద్దెకున్నవారి హక్కులు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.
స్విగ్గీ, జెప్టో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌ను తాను పెద్దగా మిస్ అవ్వడం లేదన్నారు ప్రతిమ్.జంబో, ఆల్బర్ట్ హీన్ వంటి సూపర్ మార్కెట్లలో ఇద్దరు వ్యక్తులకు నెలవారీ సరుకులకే దాదాపు 500 యూరోలు (సుమారు రూ.45,000) ఖర్చవుతుందని, ఇది బెంగళూరుతో పోలిస్తే సుమారు మూడు రెట్లు ఎక్కువని ఆమె లెక్క చెప్పారు.అయితే, అక్కడ దొరికే కూరగాయలు, సరుకులు చాలా ఫ్రెష్‌గా, హై క్వాలిటీతో ఉండటం వల్ల ఆ ఖర్చుకు తగ్గ విలువ ఉంటుందని అన్నారు.
ఆమ్‌స్టర్‌డామ్ రెస్టారెంట్లలో ఇద్దరు వ్యక్తులు ఓ మోస్తరుగా భోజనం చేస్తే సుమారు 50 యూరోలు (సుమారు రూ 4,500) బిల్లు అవుతుంది.
శాండ్‌విచ్‌ల వంటి టేక్‌అవే ఐటమ్స్ కూడా 7-15 యూరోల వరకు ఉంటాయట.అక్కడి ఇండియన్ రెస్టారెంట్లు ఏదో యావరేజ్‌గా, టూరిస్టుల కోసమే ఉన్నట్టు అనిపించాయని ఆమె అన్నారు.
కానీ, ఆశ్చర్యంగా కేఫేల ధరలు మాత్రం బెంగళూరు స్థాయిలోనే ఉండటం ఆమెను ఆశ్చర్యపరిచింది.
ఆమ్‌స్టర్‌డామ్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను ఆమె ఒక “వరం”గా అభివర్ణించారు.ముఖ్యంగా ఇండియాలో కిక్కిరిసిన బస్సులు, అక్కడ ఎదురయ్యే వేధింపులతో పోలిస్తే ఇది చాలా గొప్ప అనుభూతినిస్తోందన్నారు.క్లీన్‌గా ఉండే బస్సులు, ట్రామ్‌లు, మెట్రోలు, అందమైన ఫెర్రీ రైడ్‌లను ఆమె తెగ మెచ్చుకున్నారు.
సైకిళ్ల కోసం ప్రత్యేకంగా ఉన్న దారులు (బైక్ లేన్స్) ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని తెలిపారు.
డచ్ హెల్త్‌కేర్ సిస్టమ్ “దారుణంగా ఉంది” అని ప్రతిమ్ కుండబద్దలు కొట్టారు.
ఆరు నెలలు గడిచినా, తనకు ఇంకా ఒక జనరల్ ఫిజీషియన్ (GP) అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదని వాపోయారు.అందుకే, వైద్య చికిత్సల కోసం ఇండియాకు రావడానికే ఇష్టపడతానని చెప్పారు.
ఈ సిస్టమ్ చాలా స్లోగా పనిచేస్తుందని, ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.
స్వచ్ఛమైన గాలి, పచ్చదనం కోసమే తాను ఆమ్‌స్టర్‌డామ్‌కు మారామని చెప్పిన ప్రతిమ్, అక్కడ ప్రతి ఒక్కరూ చాలా ఫిట్‌గా కనిపిస్తారని, జిమ్ కల్చర్ బలంగా ఉందని అన్నారు.
బెంగళూరుతో పోలిస్తే ఆమ్‌స్టర్‌డామ్‌లో టెక్ జీతాలు తక్కువని, ఉద్యోగ అవకాశాలు కూడా పరిమితంగానే ఉన్నాయని ఆమె కనుగొన్నారు.ఖర్చులు ఎక్కువగా ఉన్నా, తాను ఇప్పుడు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా, క్రమశిక్షణతో ఉన్నానని ప్రతిమ్ చెప్పారు.
పనికి వెళ్లడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని, బయట ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతున్నానని తెలిపారు.ఒక మల్టీకల్చరల్ సిటీలో మైనారిటీగా ఉండటం వల్ల తన భారతీయ మూలాలకు మరింత దగ్గరైన ఫీలింగ్ కలుగుతోందన్నారు.
చాలా మంది యూజర్లు ఆమె నిజాయితీగా రాసిన పోస్ట్‌ను మెచ్చుకున్నారు.“చాలా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పారు, నిజాయితీ నచ్చింది.” అని ఒకరు కామెంట్ చేయగా, “హెల్త్‌కేర్ విషయంలో చెప్పిన నిజాలు షాకింగ్‌గా ఉన్నాయి.” అని మరొకరు అన్నారు.