ఏడాదిలో ఏకంగా 15 బ్రాండ్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్ సమంత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలలో నటించకపోయినా ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.సమంత పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

 Star Heroine Samantha Shocking Comments Goes Viral In Social Media Details, Sama-TeluguStop.com

అయితే గత ఏడాది కాలంలో సమంత ఏకంగా 15 సినిమాలను వదులుకున్నారట.వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా సెల్ఫ్ లవ్, ఆరోగ్యం, ప్రశాంతతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలలో సమంత నటిస్తుండగా ఆమె తర్వాత సినిమాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.తాను ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ వదులుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.20 సంవత్సరాల వయస్సులో ఇండస్ట్రీలో అడుగుపెట్టానని అప్పట్లో సక్సెస్ కు నిర్వచనం చాలా విభిన్నంగా ఉండేదని ఆమె కామెంట్లు చేశారు.ఎన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా( Brand Ambassador ) ఉన్నామనే దానిపైనే సక్సెస్ ను నిర్ణయించేవారని ఆమె తెలిపారు.

Telugu Samantha, Samantha Offers, Samantha Brands, Tollywood-Movie

అది నాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.కానీ ఇప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఉత్పత్తులను ప్రమోట్ చేసే సమయంలో ఎంతో బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు.ఏడాదిలో 15 బ్రాండ్స్ వదులుకున్నానని అమె చెప్పుకొచ్చారు.ఇప్పటికీ నాకు ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయని సమంత పేర్కొన్నారు.కాకపోతే ఆ ఆఫర్లను నేను అంగీకరించనని సమంత కామెంట్లు చేశారు.

Telugu Samantha, Samantha Offers, Samantha Brands, Tollywood-Movie

వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే కొత్త బ్రాండ్స్ కు ఓకే చెబుతున్నానని సమంత తెలిపారు.మయోసైటిస్( Myositis ) తో ఇబ్బంది పడుతున్న స్టార్ హీరోయిన్ సమంత చికిత్స తీసుకుంటూనే షూటింగ్ లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే ప్రాజెక్ట్ తో ఆమె బిజీగా ఉన్నారు.

సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.సమంత నిర్మాతగా కూడా పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube