ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.02
సూర్యాస్తమయం: సాయంత్రం.6.32
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.25 ల9.01 మ2.50 ల3.02
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది.ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది.స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా రాణిస్తాయి.ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారు.
వృషభం:

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.పనులలో శ్రమ అధికమౌతుంది.బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మిథునం:

ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కర్కాటకం:

ఈరోజు అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది.విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ధన వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి.దూర ప్రయాణాలలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య:

ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.వృత్తి ఉద్యోగాలలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల:

ఈరోజు బంధువర్గంతో వివాదాలు ఉంటాయి.గృహ నిర్మాణ ఆలోచనలు వాయిదా వేస్తారు.చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం:

ఈరోజు బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
ధనుస్సు:

ఈరోజు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.
చేపట్టిన పనులు చకచకా సాగుతాయి.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
మకరం:

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.బంధు, మిత్రులతో మాటపట్టింపులు.పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు.
వృధా ఖర్చులు పెరుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కుంభం:

ఈరోజు నూతన ఋణ ప్రయత్నాలు కలిసిరావు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి.
ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం:

ఈరోజు సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తాయి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.