సినీనటి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాలు గురించి మాట్లాడారు కానీ ఈమె తన రెండో పెళ్లి గురించి మాట్లాడిన వ్యాఖ్యలు మాత్రం హైలెట్ అవుతూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే.
ఇలా ఈమె రెండో పెళ్లి(Second Marriage) గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తలపై రేణు దేశాయ్ అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ నేను గంట పాటు పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు గురించి మాట్లాడాను కానీ నా రెండో పెళ్లి గురించి మాత్రమే హైలెట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నాకు 44 సంవత్సరాలు ఇప్పుడు నా రెండో పెళ్లి గురించి ఎంతో చదువుకున్నటువంటి మీడియా వారు ఇలాంటి వార్తలను ప్రచారం చేయటం వల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదని తెలిపారు.దయచేసి ఇలాంటి వార్తలపై శ్రద్ధ చూపొద్దని తెలిపారు.

ఇలా నేను ఎన్నో విషయాలు గురించి మాట్లాడితే నా రెండో పెళ్లి గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆతృత కనబరుస్తున్నారు.అయినా నా పెళ్లి గురించి నాకు లేని ఆత్రుత మీకెందుకు.నేను రెండో పెళ్లి చేసుకోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం నాకు నచ్చిన వారిని నేను పెళ్లి చేసుకుంటాను.ఇలా నా పెళ్లి గురించి మాట్లాడటం మానేసి పిల్లలకు ఎన్నో మంచి విషయాలను తెలియచేయడానికి ప్రయత్నం చెయ్యండి అంటూ రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి ఘాటుగా స్పందించారు.