సూర్యాపేట జిల్లా: మూఢనమ్మకాలతో కన్నబిడ్డను కర్కశంగా చంపిన తల్లికి శుక్రవారం సూర్యాపేట జిల్లా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.సరిగ్గా నాలుగేండ్ల క్రితం మోతె మండల పరిధిలోని క్షుద్ర పూజలు చేస్తూ కన్నబిడ్డను కత్తితో గొంతు కోసి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఆ కేసులో కూతురిని చంపిన తల్లిని దోషిగా నిర్ధారిస్తూ సూర్యాపేట జిల్లా అదనపు న్యాయమూర్తి డా.ఎం.శ్యామ్ ఉరిశిక్ష,ఐదువేల రూపాయలు జరిమానా విధించారు.







