దుంపలలో ఎక్కువగా చాలామంది ఆలుని ఇష్టపడతారు.మిగతా దుంపలను ఎక్కువగా ఇష్టపడరు.
కానీ చేమదుంపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు తెలిపారు.
మరి షుగర్ ఉన్నవారు చేమ దుంపలు తినొచ్చా తింటే ఎం అవుతుందో తెలుసుకుందామా.
చేమదుంపల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇది మధుమేహం రిస్క్ ను తగ్గిస్తుంది.అంతేకాదు డైటరీ ఫైబర్ డైజేషన్ ప్రాసెస్ ను స్లో చేస్తుంది.
దాంతో, శరీరం ఇన్సులిన్ విడుదలను రెగ్యులేట్ చేయగలుగుతుంది.బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు తెలిపారు.
కాబట్టి గ్లైసెమిక్ నియంత్రణ సాధ్యమవుతుందన్నారు.
ఈ దుంపలో కాపర్ తో పాటు ఐరన్ లభిస్తుందని అది బ్లడ్ బిల్డింగ్ కు తోడ్పడే మినరల్స్.
అనీమియాతో పాటు ఇతర రక్తసంబంధమైన సమస్యలతో బాధపడేవారికి చేమదుంప బాగా దోహద పడుతుందన్నారు.చేస్తుంది.బ్లడ్ సర్క్యూలేషన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది.చేమదుంపల్లో విటమిన్ ఏ తో పాటు విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది.
ఈ రెండు స్కిన్ డేమేజ్ ను కలిగించే వివిధ ఏజెంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి.ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కొలాజెన్ ను బ్రేక్ చేసే ఫ్రీ రాడికల్స్ ను సమూలంగా నిర్మూలిస్తాయని తెలిపారు.
అంతేకాకుండా చేమదుంపల్లో డైజెస్టివ్ అలాగే నాన్ డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.ఇవన్నీ ప్రోపర్ న్యూట్రిషన్ ను అందించేందుకు డైజెస్టివ్ హెల్త్ కు సపోర్ట్ అందించేందుకు సహకరిస్తాయి.ఇందులో డైటరీ ఫైబర్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.ఇన్సోల్యుబుల్ ఫైబర్ బవుల్ మూవ్మెంట్స్ ను క్రమబద్ధీకరిస్తుంది.చేమదుంపలో ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేసే లక్షణాలు అనేకం ఉన్నాయి.ఇందులో ఉన్న న్యూట్రియెంట్స్ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందిస్తాయని నిపుణులు తెలిపారు.