1.భారతీయులకు అమెరికా శుభవార్త
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జీన్ తీసుకున్న వారు తమ దేశానికి వచ్చేందుకు ఎటువంటి అవ్యంత్రం లేదని ప్రకటించింది.
2.వీసా పరిమితులను విధించిన కువైట్
కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడం తో కువైట్ ప్రయాణ ఆంక్షలు సడలించింది.అయితే పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇరాక్, ఇరాన్, యోమెన్, సిరియా, సుడాన్ లు ఉన్నాయి.
3.ఆస్ట్రేలియా వారికి శుభవార్త
ఆస్ట్రేలియా వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.నవంబర్ 15 నుంచి సిడ్నీ ,న్యూఢిల్లీ మధ్య నాన్ స్టాప్ గా విమాన సర్వీసులను అందుబాటులోకి తేబోతున్నట్టు ప్రకటించింది.
4.యోయెన్ లో ఘర్షణలు .200 మంది మృతి
యోయేన్ లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.ప్రభుత్వ దళాలు, హోతి తిరుగుబాటుదారుల మధ్య జరిగిన కాల్పుల్లో దాదాపు 200 మంది మృతి చెందారు.
5.ఎన్.ఆర్.ఐ కోటేశ్వరరావు కు డాక్టరేట్
తన సామాజిక కార్యక్రమాల ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎన్.ఆర్.ఐ కోటేశ్వరరావు కు ఏపీయూ వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు తాజాగా గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు.
6.చైనాలో భారీ కాలుష్యం. హైవేల మూసివేత
చైనాలో భారీ కాలుష్యం ఏర్పడడం తో బీజింగ్ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోవడంతో బీజింగ్ హై వేలను అధికారులు మూసివేశారు.
7.పాక్ లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పాకిస్థాన్ లో భారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.పెట్రోల్ పై 8.03, డీజిల్ పై 8.14, కిరోసిన్ పై 6.27 పెంచారు.
8.భారత భూ భాగంలో 100 ఇళ్లు నిర్మించుకున్న చైనా
భారత భూ భాగంలో 100 ఇళ్లను చైనా నిర్మించుకున్నట్టు అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో తేలింది.
9.కరోనా ను అంతం చేసే టాబ్లెట్ తయారు చేసిన బ్రిటన్
కరోనా అంతం చేసే టాబ్లెట్ ను బ్రిటన్ ను తయారు చేసింది.త్వరలోనే బ్రిటన్ లో ఈ టాబ్లెట్ అందుబాటులోకి రానుంది.
10.అమెరికా పై చైనా ఆరోపణలు
అమెరికా పై చైనా ఆరోపణలు చేసింది.
అణ్వాయుధాల సంపత్తి పై అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక పై చైనా మండిపడింది.చైనా తో ప్రపంచానికి ముప్పు ఉందని చెప్పేందుకే ఈ నివేదిక ను అడ్డంపెట్టుకుంది అని, అమెరికాతో ప్రపంచానికి ముప్పు ఉందని చైనా ఆరోపించింది.