జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Jana Sena leader, Power Star Pawan Kalyan) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.పవన్ హీరోగా క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా మేకర్స్ చెప్పిన డేట్ ప్రకారం మార్చి నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.అయితే ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం కష్టమని సమాచారం అందుతోంది.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల(Nithiin ,Venky Kudumula) డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ మూవీ మార్చి నెల 28వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఈ క్లారిటీ వచ్చేసింది.నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Nithin, Power Star Pawan Kalyan) కు ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హరిహర వీరమల్లు విడుదలయ్యేలా ఉంటే ఆ సినిమాకు పోటీగా తన సినిమాను రిలీజ్ చేయడానికి నితిన్ అస్సలు ఇష్టపడరని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
అయితే హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడటం ఇదే తొలిసారి కాదు.గతంలో కూడా ఈ సినిమా పలు సందర్భాల్లో వాయిదా పడింది.ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి 9 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం అందుతోంది.
హరిహర వీరమల్లు(Harihara Veeramallu) మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.పాన్ ఇండియా మూవీగా సరికొత్త కథాంశంతో తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.హరిహర సినిమాల్లో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.